గ్యాంగ్ లీడర్ రీమేక్ కాదంటున్న నాని
ఓ సినిమాను రీమేక్ చేస్తే ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పడం లేదు మేకర్స్. ఓటీటీ వేదికలపై అన్ని భాషల సినిమాలు అందుబాటులోకి వచ్చిన వేళ.. ఫలానా సినిమా రీమేక్ అంటూ ప్రకటిస్తే.. అంతా ముందే ఆ సినిమా చూసేస్తున్నారు. అందుకే రీమేక్ ప్రాజెక్టుల్ని చెప్పడం లేదు. ‘మన్మథుడు-2’ రీమేక్ అనే విషయం చెప్పలేదు. ‘ఎవరు’ రీమేక్ అనే విషయాన్ని కూడా రిలీజ్ కు ముందు చెప్పలేదు. రాజశేఖర్ కూడా తను చేయబోతున్న రీమేక్ విశేషాల్ని బయటపెట్టడం లేదు. […]
ఓ సినిమాను రీమేక్ చేస్తే ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పడం లేదు మేకర్స్. ఓటీటీ వేదికలపై అన్ని భాషల సినిమాలు అందుబాటులోకి వచ్చిన వేళ.. ఫలానా సినిమా రీమేక్ అంటూ ప్రకటిస్తే.. అంతా ముందే ఆ సినిమా చూసేస్తున్నారు. అందుకే రీమేక్ ప్రాజెక్టుల్ని చెప్పడం లేదు. ‘మన్మథుడు-2’ రీమేక్ అనే విషయం చెప్పలేదు. ‘ఎవరు’ రీమేక్ అనే విషయాన్ని కూడా రిలీజ్ కు ముందు చెప్పలేదు. రాజశేఖర్ కూడా తను చేయబోతున్న రీమేక్ విశేషాల్ని బయటపెట్టడం లేదు. ఇప్పుడీ లిస్ట్ లోకి ‘గ్యాంగ్ లీడర్’ కూడా చేరినట్టు కనిపిస్తోంది.
గ్యాంగ్ లీడర్ సినిమాను ఓ కొరియన్ మూవీ ఆధారంగా తెరకెక్కించారనేది తాజా పుకారు. కొరియన్ భాషలో సూపర్ హిట్ అయిన ‘విడో’ అనే సినిమా కథను గ్యాంగ్ లీడర్ కోసం వాడుకున్నారనేది టాపిక్. మొన్న జరిగిన ఇంటర్వ్యూలో మీడియా నేరుగా ఈ విషయాన్ని నాని ముందు ప్రస్తావించింది. అయితే నాని మాత్రం తమ సినిమా రీమేక్ ప్రాజెక్టు కాదంటున్నాడు.
ఈ స్టోరీని స్వయంగా విక్రమ్ కుమార్ రాసుకున్నాడట. నాని-విక్రమ్ కలిసి సన్నివేశాలు అల్లుకున్నారట. జస్ట్ ఈ వాక్యాలు మాత్రమే చెప్పిన నాని, ఆ విషయాన్ని దాటేశాడు. ఓవైపు నుంచి రీమేక్ గురించి మీడియా ప్రతినిథులు ప్రశ్నిస్తున్నప్పటికీ నాని మాత్రం కావాలనే ఆ మేటర్ ను స్కిప్ చేశాడు. కావాలనే మరో ప్రతినిథి అడిగిన ప్రశ్నకు జవాబు చెబుతూ, అసలు సంగతిని దాటేశాడు.
నాని వ్యవహారశైలి చూసిన మీడియా ప్రతినిధులు, గ్యాంగ్ లీడర్ కచ్చితంగా రీమేక్ అయి ఉంటుందని మరింత గట్టిగా ఫిక్స్ అయ్యారు. సినిమా విడుదలైన తర్వాత అసలు మేటర్ బయటకొస్తుంది.