చింతమనేనిపై రహస్యంగా కేసులు ఎత్తివేసిన పోలీసులు
టీడీపీ వివాదాస్పద మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అట్రాసిటీ కేసులో అరెస్ట్‌కు భయపడి ఆయన పారిపోయాడు. చింతమనేనిని పట్టుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు, అతడు తప్పించుకునే అవకాశం ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో స్థానిక పోలీసు అధికారులపైనా ఉన్నతాధికారులు వేటు వేశారు. ప్రస్తుతం చింతమనేని పరారీలో ఉన్న నేపథ్యంలో అతడి గత నేరాల చిట్టాను ఉన్నతాధికారులు బయటకు తీస్తున్నారు. దాదాపు 50కేసులు చింతమనేనిపై ఉన్నాయి. ఇలా కేసుల వివరాలను బయటకు తీస్తున్న నేపథ్యంలోనే […]
టీడీపీ వివాదాస్పద మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అట్రాసిటీ కేసులో అరెస్ట్‌కు భయపడి ఆయన పారిపోయాడు. చింతమనేనిని పట్టుకునే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు, అతడు తప్పించుకునే అవకాశం ఇచ్చారన్న ఆరోపణల నేపథ్యంలో స్థానిక పోలీసు అధికారులపైనా ఉన్నతాధికారులు వేటు వేశారు.
ప్రస్తుతం చింతమనేని పరారీలో ఉన్న నేపథ్యంలో అతడి గత నేరాల చిట్టాను ఉన్నతాధికారులు బయటకు తీస్తున్నారు. దాదాపు 50కేసులు చింతమనేనిపై ఉన్నాయి.
ఇలా కేసుల వివరాలను బయటకు తీస్తున్న నేపథ్యంలోనే కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టీడీపీ అధికారం ఆఖరి రోజుల్లో తనపై ఉన్న కేసులను చింతమనేని ఎత్తివేయించుకున్నట్టు బయటపడింది. ఇందుకు అప్పట్లో పోలీస్ శాఖలో కీలక పాత్ర పోషించిన ఒక ఉన్నతాధికారి సహకరించారు.
ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన సంచలన కేసు కూడా ఈ కోవలో ఎత్తివేశారు. చింతమనేనిపై వనజాక్షి పెట్టింది తప్పుడు కేసు అంటూ దాన్ని తొలగించారు. ఈ తంతు ఫిబ్రవరిలో జరిగింది. ఈ కేసును ఎత్తివేసే సమయంలో ఫిర్యాదుదారుగా ఉన్న వనజాక్షికి కూడా సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా పోలీసులు వ్యవహరించారు. తప్పుడు కేసు కింద రిఫర్ చేసినప్పుడు ఆ విషయాన్ని పోలీసులు కోర్టుకు కూడా తెలియజేయాల్సి ఉంటుంది. కోర్టు బాధితులకు నోటీసులు ఇచ్చి ఆరా తీస్తుంది. కానీ ఈ తంతు ఏమీ లేకుండానే నేరుగా చింతమనేనిపై కేసును టీడీపీ పోలీసు ఉన్నతాధికారులు ఎత్తివేశారు.
ఈ కేసుతో పాటు ఏఎస్‌ఐపై దాడి కేసును, ఏలూరు పోలీస్ స్టేషన్‌లో చింతమనేని దౌర్జన్యం చేసిన కేసులను కూడా తప్పుడు కేసులుగా పోలీసు ఉన్నతాధికారులు ఎత్తివేశారు. చింతమనేనిపై మొత్తం 49 కేసులు నమోదు కాగా… అందులో 23 కేసులను ఇలా తప్పుడు కేసులు అంటూ పోలీసులు తీసేశారు. ఈ కేసుల ఎత్తివేత అంశాన్ని పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతూ వచ్చారు.