ఎంపీ సీటు కోసం 32 కోట్లు ఖర్చు పెట్టా !
మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైంది. ఇప్పటికే అనుచరులకు క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇటీవలే ఆయన చంద్రబాబుని కలిశారు. ఆయన్ని ఎందుకు కలిశారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎన్నికల సమయంలో పెట్టిన డబ్బు కోసమా…లేక వేరే కారణాలు ఉన్నాయా అనే చర్చ జమ్మలమడుగులో నడుస్తోంది. ఎన్నికల సమయంలో ఇస్తానన్న డబ్బు సర్దుబాటు చేయలేదని ఈ సమావేశంలో చంద్రబాబుకి ఆది నారాయణరెడ్డి గుర్తు చేశారని తెలుస్తోంది. తాను అప్పు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారట. […]
మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమైంది. ఇప్పటికే అనుచరులకు క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఇటీవలే ఆయన చంద్రబాబుని కలిశారు. ఆయన్ని ఎందుకు కలిశారు అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎన్నికల సమయంలో పెట్టిన డబ్బు కోసమా…లేక వేరే కారణాలు ఉన్నాయా అనే చర్చ జమ్మలమడుగులో నడుస్తోంది.
ఎన్నికల సమయంలో ఇస్తానన్న డబ్బు సర్దుబాటు చేయలేదని ఈ సమావేశంలో చంద్రబాబుకి ఆది నారాయణరెడ్డి గుర్తు చేశారని తెలుస్తోంది. తాను అప్పు తీసుకుని ఎన్నికల్లో పోటీ చేశానని చెప్పారట. తాను ఖర్చు చేసిన మొత్తంలో తనకు ఇంకా 32 కోట్ల రూపాయలు పార్టీ ఇవ్వాల్సి ఉందని వివరాలు ఇచ్చారట.
పులివెందులలో సతీష్ రెడ్డికి, పోరెడ్డి ప్రభాకర్ రెడ్డికి… ఇలా పేర్లు చెప్పుకుంటూ తాను చెల్లించాల్సిన మొత్తాల గురించి ఏకరవు పెట్టారట. అయితే చంద్రబాబుకి ఇక్కడే పెద్ద డౌట్ వచ్చినట్లు కార్యకర్తలు చెబుతున్నారు. పులివెందులలో ఓడిపోతామని తెలుసు. అక్కడ మెజార్టీ రాదని తెలుసు… కానీ అక్కడ ఖర్చు పెట్టినట్లు ఆది చూపించిన అమౌంట్ పై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేశారట.
దీంతో ఆది ఒకింత కటువుగానే చంద్రబాబుకి సమాధానం ఇచ్చారని తెలుస్తోంది. ఓడిపోతానని తెలిసే తనను ఎంపీ క్యాండేట్‌గా పెట్టారని..తనకు అన్యాయం చేశారని వాపోయారట. రాజకీయ భవిష్యత్తును ఫణంగా పెడితే… చివరికి అప్పులపాలై నవ్వులపాలవుతున్నానని మాట్లాడారట. మీరు చెప్పారని రామసుబ్బారెడ్డి కేసు విషయంలో సుప్రీంకోర్టులో రాజీ అయిన విషయాన్ని ప్రస్తావించారట.
ఇటు పనిలో పనిగా చంద్రబాబుపై కూడా చురకలు వేశారట. ఎన్నికలకు ముందే వైసీపీ తరహాలో ప్రశాంత్ కిషోర్ లా టీడీపీకి ఒకరిని నియమించుకుంటే బావుంటుందని సలహా ఇచ్చినా పెడచెవిన పెట్టారని అన్నారట. అలాగే లీగల్ గా పెట్టుకున్న దమ్మాలపాటి శ్రీనివాస్ సామర్థ్యంపై పలు సందేహాలు లేవనెత్తారట. ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు.
ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బు ఇప్పటికీ ఇవ్వలేదు. హైదరాబాద్ లో ఉన్న ఇల్లు, జమ్మలమడుగులో ఉన్న స్థలంలో ప్లాట్ లు వేసి కొంత మొత్తం అప్పు చెల్లించానని ఆధారాలతో సహా చూపించారట. ప్రస్తుతం మనం కష్టాల్లో ఉన్నామని డబ్బులు త్వరలోనే సర్దుబాటు చేస్తామని పార్టీలో కొనసాగాలని బాబు కోరారట. అయితే జగన్ నన్ను టార్గెట్ చేయడం ఖాయమని అందుకే తాను కమలం కండువా కప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆది చంద్రబాబుతో చెప్పారట. టోటల్ గా చంద్రబాబు, ఆది మధ్య మనీమేటర్‌పైనే ఎక్కువ చర్చ నడిచినట్లు ఇప్పుడు కడపలో గుసగుసలు విన్పిస్తున్నాయి.