జగన్‌కు వందకు వంద మార్కులు... సలహాలు ఇచ్చే వారు కావాలి...
జగన్ వంద రోజుల పాలనకు వంద మార్కులు వేయాల్సిందేనన్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జగన్ తమ వాడేనన్నారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు గత ప్రభుత్వ పనుల ప్రభావం కూడా ఉంటుందని… కొంచెం సమయం ఇచ్చి చూడాలన్నారు. జగన్ కిందపడుతున్నా లేస్తున్నాడని… జగన్‌కు చేయి పట్టుకుని నడిపించేవారు… మంచి సలహాలు ఇచ్చే వారు కావాలన్నారు. చేయి పట్టుకుని నడిపించే వారు ఇంకా జగన్‌కు దొరికినట్టుగా కనిపించడం లేదన్నారు. పది మందికి […]
జగన్ వంద రోజుల పాలనకు వంద మార్కులు వేయాల్సిందేనన్నారు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి. ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా జగన్ తమ వాడేనన్నారు. కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు గత ప్రభుత్వ పనుల ప్రభావం కూడా ఉంటుందని… కొంచెం సమయం ఇచ్చి చూడాలన్నారు.
జగన్ కిందపడుతున్నా లేస్తున్నాడని… జగన్‌కు చేయి పట్టుకుని నడిపించేవారు… మంచి సలహాలు ఇచ్చే వారు కావాలన్నారు. చేయి పట్టుకుని నడిపించే వారు ఇంకా జగన్‌కు దొరికినట్టుగా కనిపించడం లేదన్నారు.
పది మందికి మంచి చేయాలన్న తపన జగన్‌లో కనిపిస్తున్నప్పుడు కొద్దిగా వేచి చూడడం మంచిదన్నారు. అడిగితే మీరు సలహా ఇస్తారా అని ప్రశ్నించగా… ”మమ్మలను ఎందుకు రానిస్తారు?. ఒకవేళ మేమే వెళ్తే ఎవడు రమ్మన్నారు అంటే అప్పుడు మేం ఏం చేయాలి. కాబట్టి అడిగితే అప్పుడు ఆలోచన చేద్దాం” అని జేసీ వ్యాఖ్యానించారు.
వంద రోజుల పాలనకు వంద మార్కులు వేయాల్సిందేనని… తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని జేసీ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి అంతా మంచి జరగాలి… జగన్‌కు కూడా అంతా మంచే జరగాలని జేసీ దివాకర్ రెడ్డి ఆకాంక్షించారు.