Telugu Global
NEWS

జగన్‌ వెంట పడుతున్న కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు

టీటీడీ బోర్డు నియామకంపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు దాదాపు పూర్తి చేశారు. సభ్యుల ఎంపిక విషయంలో సీఎం తీవ్ర ఒత్తిళ్లకు లోనయ్యారు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని కేబినెట్‌ భేటీలో కూడా చెప్పారు. టీటీడీ బోర్డులో సభ్యత్వం కోసం ఈ స్థాయిలో పోటీ ఉంటుందని తాను కూడా ఊహించలేదని మంత్రులు వద్ద వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్లు చేసి టీటీడీలో సభ్యత్వం కోసం సిఫార్సులు చేశారని జగన్ వివరించారు. కేబినెట్‌ కూర్పులో కూడా […]

జగన్‌ వెంట పడుతున్న కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు
X

టీటీడీ బోర్డు నియామకంపై ముఖ్యమంత్రి జగన్ కసరత్తు దాదాపు పూర్తి చేశారు. సభ్యుల ఎంపిక విషయంలో సీఎం తీవ్ర ఒత్తిళ్లకు లోనయ్యారు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని కేబినెట్‌ భేటీలో కూడా చెప్పారు. టీటీడీ బోర్డులో సభ్యత్వం కోసం ఈ స్థాయిలో పోటీ ఉంటుందని తాను కూడా ఊహించలేదని మంత్రులు వద్ద వ్యాఖ్యానించారు.

కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఫోన్లు చేసి టీటీడీలో సభ్యత్వం కోసం సిఫార్సులు చేశారని జగన్ వివరించారు. కేబినెట్‌ కూర్పులో కూడా తాను ఇంతగా ఒత్తిడికి గురికాలేదని సరదాగా వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలోనే బోర్డులో సభ్యుల సంఖ్యను 18 నుంచి 25కు పెంచుతూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌కు టీటీడీలో ఎక్స్‌ఆఫిషియో మెంబర్‌గా స్థానం కల్పించనున్నట్టు సీఎం చెప్పారు. కార్పొరేషన్ చైర్మన్‌గా మల్లాది విష్ణును నియమించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఎక్స్‌ఆఫిషియో మెంబర్‌గా టీటీడీలో మల్లాది విష్ణుకు అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు.

First Published:  5 Sept 2019 7:37 AM IST
Next Story