ఇసుకను ఇలా బుక్ చేసుకోవచ్చు...
కొత్తప్రభుత్వం ఇసుక పాలసీని తీసుకొచ్చింది. కొత్త పద్దతిలో ఇసుక మాఫియాకు అవకాశం దాదాపు లేకుండా పోయింది. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖాతాలోకే జమ అయ్యేలా పక్కాగా పాలసీని తీసుకొచ్చారు. ఇసుకను ఆన్‌లైన్‌లో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. http://www.sand.ap.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇసుకను బుక్ చేసుకోవచ్చు. వైబ్‌సైట్‌లోకి ఎంటరైన తర్వాత మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అడ్రస్‌ను ఎంటర్ చేసి ఇసుక కొనుగోలు చేస్తే నేరుగా ఇంటి […]
కొత్తప్రభుత్వం ఇసుక పాలసీని తీసుకొచ్చింది. కొత్త పద్దతిలో ఇసుక మాఫియాకు అవకాశం దాదాపు లేకుండా పోయింది. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం నేరుగా ప్రభుత్వ ఖాతాలోకే జమ అయ్యేలా పక్కాగా పాలసీని తీసుకొచ్చారు.
ఇసుకను ఆన్‌లైన్‌లో ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. http://www.sand.ap.gov.in అనే వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఇసుకను బుక్ చేసుకోవచ్చు. వైబ్‌సైట్‌లోకి ఎంటరైన తర్వాత మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అడ్రస్‌ను ఎంటర్ చేసి ఇసుక కొనుగోలు చేస్తే నేరుగా ఇంటి వద్దకే ఇసుకను తీసుకొస్తారు.
డబ్బులు కూడా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఉదయం 12 గంటలలోపు ఏఏ స్టాక్ పాయింట్‌లో ఎంత ఇసుక ఉంది అన్నది వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేస్తారు. మధ్యాహ్నం 12 తర్వాత ఇసుక బుకింగ్‌ను స్వీకరిస్తారు. అందుబాటులో ఉన్న వాహనాలను కూడా వెబ్‌సైట్లో చూడవచ్చు. ఇసుకను రవాణా చేసే ప్రతి వాహనానికి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్)ను తప్పనిసరి చేశారు. కాబట్టి ఇసుకను బుక్ చేసుకున్న తర్వాత జీపీఎస్ ఆధారంగా వాహనం ఎక్కడ ఉంది, ఎంతసేపటిలో వస్తుంది అన్నది కూడా తెలుసుకోవచ్చు.
స్టాక్ పాయింట్ వద్ద టన్ను ఇసుకను 375 రూపాయలకు విక్రయిస్తారు. అక్కడి నుంచి వినియోగదారుడి వద్దకు చేర్చేందుకు రవాణా చార్జీ అదనం. ప్రతి కిలోమీటర్ రవాణాకు టన్ను ఇసుకపై 4.9 రూపాయలు వసూలు చేస్తారు. 10 కిలోమీటర్ల లోపు ట్రాక్టర్ ద్వారా ఇసుక రవాణాకు చార్జీని 500గా నిర్ణయించారు.
ఒక ట్రాక్టర్‌లో 4.5 టన్నుల ఇసుక పడుతుంది. అంటే స్టాప్‌పాయింట్ 4.5 టన్నుల ఇసుక ధర 1677 రూపాయలు… అక్కడి నుంచి పది కిలోమీటర్ల పరిధిలో ఇసుక రవాణా చార్జీ 500 కలిపితే ట్రాక్టర్ ఇసుక వినియోగదారుడుకి చేరేందుకు 2వేల 187 రూపాయలు అవుతుంది.
లారీ ద్వారా ఎక్కువ మొత్తంలో ఇసుకను కొనుగోలు చేసిన వారికి రవాణా భారం తగ్గే అవకాశం ఉంది. 10 టన్నుల ఇసుకను పది కిలోమీటర్ల పరిధిలో లారీ ద్వారా రవాణాకు 4వేల 240 రూపాయలు అవుతుంది. 10 కిలోమీటర్ల కంటే దూరం ఉంటే ప్రతి టన్ను ఇసుక రవాణాపై కిలోమీటర్‌కు 4.9 రూపాయలు వసూలు చేస్తారు.
ఇసుక రీచ్‌ల నుంచి స్టాక్ పాయింట్‌కు.. స్టాక్ పాయింట్ నుంచి వినియోగదారుడి వద్దకు ఇసుకను చేర్చే ప్రతి వాహనానికి జీపీఎస్ ఉంటుంది కాబట్టి ఇసుక పక్క దారి పట్టే అవకాశం లేదు. ప్రతి ఇసుక రీచ్ వద్ద సీసీ కెమెరాలను తప్పనిసరి చేశారు. ఇసుక సరఫరాలో భాగస్వామ్యం కావాలనుకునే వాహనదారులు ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులను సంప్రదించి వారి అనుమతితో వాహనాలకు జీపీఎస్ అమర్చుకోవచ్చు. బిల్డర్లు, పెద్దపెద్ద సంస్థలు భారీగా ఇసుక కొనుగోలు కూడా ఈ విధానంలోనే జరపవచ్చు.