Telugu Global
NEWS

ఇసుక చవక... నవమి నుంచి వైఎస్ఆర్ పెళ్లి కానుక

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. గడచిన నాలుగు సంవత్సరాలుగా ఇసుక మాఫియాతో ఏపీ ప్రజలను వంచించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన టీడీపీ నాయకులకు చెక్ పెడుతూ తక్కువ ధరకే ఇసుకను విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఇసుక టన్ను రూ. 375 రూపాయలకు విక్రయిస్తారు. దీనికి అదనంగా రవాణా నిమిత్తం టన్ను ఇసుకకు కిలోమీటర్ కు రూ.4.90 వంతున చార్జి చేస్తారు. ప్రస్తుతం […]

ఇసుక చవక... నవమి నుంచి వైఎస్ఆర్ పెళ్లి కానుక
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు వరాల జల్లు కురిపించారు. గడచిన నాలుగు సంవత్సరాలుగా ఇసుక మాఫియాతో ఏపీ ప్రజలను వంచించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన టీడీపీ నాయకులకు చెక్ పెడుతూ తక్కువ ధరకే ఇసుకను విక్రయించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఇసుక టన్ను రూ. 375 రూపాయలకు విక్రయిస్తారు. దీనికి అదనంగా రవాణా నిమిత్తం టన్ను ఇసుకకు కిలోమీటర్ కు రూ.4.90 వంతున చార్జి చేస్తారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లోను 41 ఇసుక రీచ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అక్టోబర్ నెలాఖరు నాటికి వీటిని 70 నుంచి 80 రీచ్ లకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇసుక రవాణ ప్రక్రియను ఇక నుంచి ఏపీఎండీసీ చేపడుతుంది. పట్టా భూముల్లో ఇసుక తవ్వాలంటే రైతుల అనుమతి తీసుకోవాల్సిందే. ఇక్కడి ఇసుక తవ్వకాలను ఏపీఎండీసీ చేపడుతుంది.

అంతే కాదు, పట్టా భూముల్లో ఇసుకను క్యూబిక్ మీటర్ కు రూ. 60 రూపాయల చొప్పున రైతులకు చెల్లిస్తారు. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 82 చోట్ల పట్టా భూములను గుర్తించారు ఏపీఎండీసీ అధికారులు. ఇసుక రవాణా చేసే ప్రతీ వాహనానికి జీపీఎస్ తప్పనిసరి. అనుమతి లేని వాహనాల్లో ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఇక శ్రీరామనవమి పండుగ నుంచి రాష్ట్రంలో వై.ఎస్.ఆర్ పెళ్లికానుకను అందించాలని ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది. ఈ పథకం కోసం ఏడాదికి రూ. 746.55 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇక ఎస్సీలకు ఇప్పటి వరకూ ఇచ్చే పెళ్లికానుకను రూ. 40 వేల నుంచి లక్ష రూపాయలకు, ఎస్టీలకు ఇస్తున్న రూ. 50 వేల రూపాయల నుంచి లక్ష రూపాయలకు పెళ్లికానుక మొత్తాన్ని పెంచాలని నిర్ణయించారు. ఈ పథకం లబ్దిదారులు 96,397 మంది ఉంటారని ప్రాధమిక అంచనా. ఈ పథకం కింద బీసీలకు ఇప్పటి వరకూ ఇస్తున్న రూ.35 వేలను 50 వేల రూపాయలకు, మైనార్టీలకు రూ. 50 వేల నుంచి లక్ష రూపాయలకు, వికలాంగులకు లక్ష నుంచి లక్షా 50 వేల రూపాలయలకు పెంచాలని మంత్రివర్గం తీర్మానించింది.

ఇక వె.ఎస్.ఆర్ పెళ్లికానుక ప్రోత్సాహకాలుగా ఇతర కులాల వారు ఎస్సీలను పెళ్లి చేసుకుంటే 1.20 లక్షలు, ఎస్టీలను చేసుకుంటే 1.20 లక్షలు, బీసీలను చేసుకుంటే రూ.70 వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక నుంచి రాష్ట్ర్రంలో సొంతంగా ఆటోలు, కార్లు నడుపుకునే ఓనర్ కమ్ డ్రైవర్లకు ఏడాదికి రూ. 10 వేల రూపాయల ప్రోత్సాహకాన్ని కూడా ఇవ్వాలని నిర్ణయించారు.

ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 3.97 లక్షల మంది ఆటో, కారు ఓనర్ కమ్ డ్రైవర్లు ఉన్నారని, వారికి 397.93 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ప్రాథమిక అంచనా వేసారు. లబ్దిదారులకు సెప్టెంబర్ 10 వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను అందుబాటులో ఉంచుతారు.

ఇక ఆశ వర్కర్ల జీతాలను కూడా మూడు వేల రూపాయల నుంచి 10 వేల రూపాయలకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్రలోను, ఎన్నికల మ్యానిఫెస్టోలోను ఇచ్చిన హమీ మేరకు ఆశా వర్కర్ల వేతనాలను పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

First Published:  5 Sept 2019 3:14 AM IST
Next Story