ఊహించిందే జరిగింది....
సాహో హనీమూన్ ముగిసింది. వినాయక చవితితో కలుపుకొని మొదటి 4 రోజులు పండగ చేసుకున్న ఈ సినిమా, మంగళవారం నుంచి ఒక్కసారిగా పడిపోయింది. నెగెటివ్ టాక్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇదేదో కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, వరల్డ్ వైడ్ సాహో సినిమాకు నిన్న వసూళ్లు తగ్గిపోయాయి. వచ్చే శనివారం వరకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కోట్ల రూపాయల నెట్ తో దూసుకుపోతున్న సాహోకు మంగళవారం నార్త్ లో కేవలం 9 కోట్లు మాత్రమే వచ్చాయి. […]
సాహో హనీమూన్ ముగిసింది. వినాయక చవితితో కలుపుకొని మొదటి 4 రోజులు పండగ చేసుకున్న ఈ సినిమా, మంగళవారం నుంచి ఒక్కసారిగా పడిపోయింది. నెగెటివ్ టాక్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. ఇదేదో కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, వరల్డ్ వైడ్ సాహో సినిమాకు నిన్న వసూళ్లు తగ్గిపోయాయి. వచ్చే శనివారం వరకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది.
కోట్ల రూపాయల నెట్ తో దూసుకుపోతున్న సాహోకు మంగళవారం నార్త్ లో కేవలం 9 కోట్లు మాత్రమే వచ్చాయి. ఇటు తెలుగు రాష్ట్రాలల్లో ఈ సినిమాకు మంగళవారం కేవలం 3 కోట్లు మాత్రమే షేర్ వచ్చింది. వీటిలో కోటిన్నర నైజాం నుంచే వచ్చింది. అటు ఓవర్సీస్ లో కూడా సాహోకు కలెక్షన్లు తగ్గిపోయాయి. ఓవరాల్ గా చూసుకుంటే.. సాహోకు 44శాతం ఆక్యుపెన్సీ పడిపోయింది.
నిన్నటి వసూళ్లతో కలుపుకొని వరల్డ్ వైడ్ 350 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసింది సాహో. అయితే ఇది ఏమంత చెప్పుకోదగ్గ విశేషం కాదు. ఎందుకంటే నెట్ పరంగా చూసుకుంటే… సాహోకు సినిమా 5 రోజుల్లో కేవలం 55శాతం మాత్రమే రికవరీ అయింది. నెగెటివ్ టాక్ తో మిగతా 45శాతం రికవర్ అవ్వడం దాదాపు అసాధ్యం అంటోంది ట్రేడ్. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 5 రోజుల్లో వచ్చిన వసూళ్లు ఇలా ఉన్నాయి.
నైజాం – రూ. 25 కోట్లు
సీడెడ్ – రూ. 10.20 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 8.38 కోట్లు
ఈస్ట్ – రూ. 6.65 కోట్లు
వెస్ట్ – రూ. 5.02 కోట్లు
గుంటూరు – రూ. 7.31 కోట్లు
నెల్లూరు – రూ. 3.74 కోట్లు
కృష్ణా – రూ. 4.64 కోట్లు