ఒక్క ఫొటో రేవంత్‌ను పీసీసీ చీఫ్‌ను చేస్తుందా ?
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కలిశారు. ఆయన ఒక్కరే కలవలేదు. కుటుంబ సమేతంగా వెళ్లి ఫొటో దిగారు. ఫొటోలో ఆయనతో పాటు భార్య, కూతురు, అల్లుడు ఉన్నారు. జైపాల్‌రెడ్డి సంతాప కార్యక్రమానికి ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఫ్యామిలీ సోనియాను కలిశారు. ఈ సందర్భంగా ఫొటో దిగారు. ఈ ఒక్క ఫొటోతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఓ చర్చ మొదలైంది. కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ అని విశ్లేషణలు మొదలయ్యాయి. ఉత్తమ్ […]
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కలిశారు. ఆయన ఒక్కరే కలవలేదు. కుటుంబ సమేతంగా వెళ్లి ఫొటో దిగారు. ఫొటోలో ఆయనతో పాటు భార్య, కూతురు, అల్లుడు ఉన్నారు. జైపాల్‌రెడ్డి సంతాప కార్యక్రమానికి ఢిల్లీ వెళ్లిన రేవంత్ ఫ్యామిలీ సోనియాను కలిశారు. ఈ సందర్భంగా ఫొటో దిగారు.
ఈ ఒక్క ఫొటోతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో ఓ చర్చ మొదలైంది. కొత్త పీసీసీ చీఫ్ రేవంత్ అని విశ్లేషణలు మొదలయ్యాయి. ఉత్తమ్ పదవీ కాలం ముగిసింది. ఆయన్ని కొనసాగించే అవకాశం లేదు. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలు ముగిశాయి. కానీ జాతీయ అధ్యక్షుడు దగ్గర పీటముడి పడింది. తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతున్నారు. దీంతో సోనియాను రేవంత్ కలిశారు. ఆయన్ని తర్వాత పీసీసీ చీఫ్‌గా నియమించే అవకాశం ఉందని ఆయన వర్గం వాదన.
అయితే ఈ ఒక్క ఫొటోతో అలర్ట్ అయిన రేవంత్ వ్యతిరేకవర్గం ఆయనకు పదవీ రాకుండా పావులు కదిపేందుకు రెడీ అవుతోంది. ఉత్తమ్ పదవీకాలం దగ్గరపడింది. భట్టికి సీఎల్పీ పదవి ఇస్తే….ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. ఇక మిగిలిన పెద్ద పదవులు ఏం లేవు.
అయితే ఇన్నాళ్లు దక్షిణ తెలంగాణకు పీసీసీ పదవి ఇచ్చారు. ఇప్పుడు ఉత్తర తెలంగాణ కు పదవి ఇవ్వాలని కొందరు సీనియర్లు డిమాండ్ చేస్తున్నారట. ఇందులో భాగంగా ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్‌కు చెందిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లేదా ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పేరును తెరపైకి తీసుకొస్తున్నారట.
మొత్తానికి రేవంత్‌కు చెక్ పెట్టేందుకు ఈ వర్గం అలర్ట్ అయింది. కాంగ్రెస్ రాజకీయాలు అంటేనే ఇవి కామన్. ఒకరు ఢిల్లీలో గ్రిప్ సంపాదిస్తే…మరొకరు దాన్ని పొగొట్టాలని చూడడం కాంగ్రెస్ లో సహజం.
ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారితో మర్యాదపూర్వక భేటీ
Posted by Anumula Revanth Reddy on Tuesday, 3 September 2019