Telugu Global
NEWS

కొహ్లీ చేజారిన టాప్ ర్యాంక్

ప్రపంచ నంబర్ వన్ గా స్టీవ్ స్మిత్  టాప్ టెన్ లో అజింక్యా రహానే టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంక్ ను భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ చేజార్చుకొన్నాడు. విండీస్ తో రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆఖరి ఇన్నింగ్స్ లో కొహ్లీ డకౌట్ కావడంతో.. రెండోర్యాంక్ కు పడిపోయాడు. ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఏడాది విరామం తర్వాత తిరిగి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ కు చేరాడు. బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధం […]

కొహ్లీ చేజారిన టాప్ ర్యాంక్
X
  • ప్రపంచ నంబర్ వన్ గా స్టీవ్ స్మిత్
  • టాప్ టెన్ లో అజింక్యా రహానే

టెస్ట్ క్రికెట్ టాప్ ర్యాంక్ ను భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ చేజార్చుకొన్నాడు. విండీస్ తో రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆఖరి ఇన్నింగ్స్ లో కొహ్లీ డకౌట్ కావడంతో.. రెండోర్యాంక్ కు పడిపోయాడు.

ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఏడాది విరామం తర్వాత తిరిగి ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ కు చేరాడు. బాల్ టాంపరింగ్ వివాదంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న స్మిత్ తిరిగి పుంజుకొన్నాడు.

ఇంగ్లండ్ తో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని మొదటి రెండుటెస్టుల్లోనూ రెండు సెంచరీలతో పాటు, 92 పరుగుల స్కోరు సాధించడం ద్వారా..తిరిగి టాప్ ర్యాంక్ అందుకోగలిగాడు. విరాట్ కొహ్లీ కంటే ఒక్క పాయింటు మాత్రమే ఆధిక్యంలో నిలిచాడు.

మూడుటెస్టుల్లో సెంచరీలేని కొహ్లీ…

భారత క్రికెట్ పరుగుల యంత్రం విరాట్ కొహ్లీ…సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో కేవలం 24 సెంచరీల దగ్గరే నిలిచిపోయాడు. ఆడిన గత మూడుటెస్టుల్లో శతకం సాధించడంలో విఫలయ్యాడు.

విశాఖ వేదికగా అక్టోబర్ 2న సౌతాఫ్రికాతో ప్రారంభమయ్యే రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ద్వారా కొహ్లీ తిరిగి టాప్ ర్యాంక్ కు చేరే అవకాశాలు లేకపోలేదు.

మరోవైపు భారత వైస్ కెప్టెన్ అజింక్యా రహానే సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి టాప్ టెన్ ర్యాంకర్లలో నిలిచాడు.

విండీస్ తో ముగిసిన రెండుమ్యాచ్ ల సిరీస్ లో రహానే సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు సాధించడం ద్వారా నాలుగు స్థానాలు మెరుగుపరచుకొని..7వ ర్యాంక్ కు చేరాడు.

40 ర్యాంక్ లు మెరుగుపరచుకొన్న విహారీ..

విండీస్ తో సిరీస్ లో టాప్ స్కోరర్ గా నిలవడం ద్వారా తెలుగుతేజం హనుమ విహారీ 40 స్థానాల మేర తన ర్యాంక్ ను మెరుగుపరచుకొని..30వ ర్యాంక్ కు చేరాడు.

నాలుగు ఇన్నింగ్స్ లో విహారీ మొత్తం 289 పరుగులు సాధించాడు. తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆరు టెస్టులు మాత్రమే ఆడిన విహారీ కెరియర్ లో ఇదే అత్యుత్తమ ర్యాంక్ కావడం విశేషం.

First Published:  4 Sept 2019 10:40 AM IST
Next Story