జీతాల చెల్లింపులో బీఎస్‌ఎన్‌ఎల్ విఫలం
కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సకాలంలో జీతాలు చెల్లించే విషయంలో మరోసారి చేతులెత్తేసింది. ఇలా జరగడం ఈ ఏడాదిలో ఇది మూడో సారి. కావాలనే కేంద్ర ప్రభుత్వం, బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ సకాలంలో జీతాలు చెల్లించకుండా కుట్ర చేస్తున్నాయని ఎంప్లాయిస్ యూనియన్ ఆరోపించింది. యాజమాన్య తీరుకు నిరసనగా ఉద్యోగులు దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు దిగారు. సకాలంలో జీతాలు చెల్లించకుండా ఉద్యోగుల్లో భయాందోళన రేకెత్తించి ఆ తర్వాత స్వచ్చంద పదవీ విరమణ స్కీంను అమలు చేయాలన్న కుట్రతోనే కేంద్ర […]
కేంద్ర ప్రభుత్వ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సకాలంలో జీతాలు చెల్లించే విషయంలో మరోసారి చేతులెత్తేసింది. ఇలా జరగడం ఈ ఏడాదిలో ఇది మూడో సారి. కావాలనే కేంద్ర ప్రభుత్వం, బీఎస్‌ఎన్‌ఎల్ సంస్థ సకాలంలో జీతాలు చెల్లించకుండా కుట్ర చేస్తున్నాయని ఎంప్లాయిస్ యూనియన్ ఆరోపించింది. యాజమాన్య తీరుకు నిరసనగా ఉద్యోగులు దేశ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు దిగారు.
సకాలంలో జీతాలు చెల్లించకుండా ఉద్యోగుల్లో భయాందోళన రేకెత్తించి ఆ తర్వాత స్వచ్చంద పదవీ విరమణ స్కీంను అమలు చేయాలన్న కుట్రతోనే కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్ ఆస్తుల ముందు అప్పులు పెద్ద సమస్యే కాదని వాదిస్తున్నాయి.
ఈ ఏడాది ఇప్పటికే మూడుసార్లు ఇలా జీతాల చెల్లింపులో జాప్యం జరగగా… ఈసారి అసలు జీతాలు ఎప్పుడిస్తారో కూడా చెప్పడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు. జియో రంగ ప్రవేశం తర్వాత బీఎస్ఎన్‌ఎల్ ఆదాయం కూడా భారీగా పడిపోయింది. సంస్థ రెవెన్యూ రాబడి 32 వేల కోట్ల నుంచి 18వేల కోట్లకు పడింది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రస్తుతం లక్షా 65వేల 179 మంది ఉద్యోగులు ఉన్నారు. సంస్థకు వస్తున్న ఆదాయంలో 75 శాతం వారి జీతాలకే సరిపోతోంది.