Telugu Global
Cinema & Entertainment

పాటకు ముందు... పేర్లు చెప్పాల్సిందేనట!

కొన్నేళ్ళ క్రితం పాటలను ఎక్కువగా రేడియో ద్వారానే వినేవాళ్ళు. ఆకాశవాణి, ప్రసారభారతి వంటి రేడియో స్టేషన్లు పాటలు వేసే ముందు ఆ పాటని రాసిన రైటర్, మ్యూజిక్ డైరెక్ట్, సినిమా పేరు… ఇలా అన్ని వివరాలు చెప్పేవారు. వారికి క్రెడిట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎఫ్ ఎం రేడియో స్టేషన్లు వచ్చాక క్రెడిట్స్ ఇవ్వడం పూర్తిగా మానేశారు. అయితే ఇప్పుడు ప్రముఖ గేయ రచయితలు ఎఫ్ ఎమ్ రేడియో స్టేషన్ల పై మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో… […]

పాటకు ముందు... పేర్లు చెప్పాల్సిందేనట!
X

కొన్నేళ్ళ క్రితం పాటలను ఎక్కువగా రేడియో ద్వారానే వినేవాళ్ళు. ఆకాశవాణి, ప్రసారభారతి వంటి రేడియో స్టేషన్లు పాటలు వేసే ముందు ఆ పాటని రాసిన రైటర్, మ్యూజిక్ డైరెక్ట్, సినిమా పేరు… ఇలా అన్ని వివరాలు చెప్పేవారు. వారికి క్రెడిట్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఎఫ్ ఎం రేడియో స్టేషన్లు వచ్చాక క్రెడిట్స్ ఇవ్వడం పూర్తిగా మానేశారు.

అయితే ఇప్పుడు ప్రముఖ గేయ రచయితలు ఎఫ్ ఎమ్ రేడియో స్టేషన్ల పై మండి పడుతున్నారు.

ఈ నేపథ్యంలో… ప్రముఖ గేయ రచయిత భాస్కరభట్ల ఎఫ్ ఎమ్ రేడియో వాళ్ళు పాటను ప్లే చేసే ముందు ఆ పాట రాసిన రచయిత పేరు కూడా చెబితే బాగుంటుందని కోరుతున్నాడు.

రామజోగయ్యశాస్త్రి కూడా…. కొందరు పాట రాసిన వారి పేరు కాకుండా వేరే రచయితల పేర్లను చెబుతున్నారని….అదేవిధంగా గేయ రచయితలందరి పేర్లను పాటను ప్లే చేసేముందు తప్పకుండా చెప్పి గౌరవిస్తే బాగుంటుందని అంటున్నాడు. కొన్ని ఎఫ్ ఎమ్ స్టేషన్లు ఇప్పటికే పాటకు సంబంధించిన వివరాలను చెబుతున్నారు…. కానీ కొందరు మాత్రం పెద్దగా పట్టించుకోవడంలేదట.

అయితే వారు అలా చేయడానికి కూడా ఒక కారణం ఉందని చెబుతున్నారు. మాములుగా ఎఫ్ ఎం స్టేషన్లు దాదాపు ఒక రోజులో 100 నుంచి 150 పాటలు ప్లే చేస్తాయి. పాటకు సంబంధిన డిటేయిల్స్ చెప్పాలి అంటే కనీసం ప్రతి పాటకి పది సెకండ్లు కేటాయించాలి. రోజుమొత్తంమీద అలా 30 నిమిషాలు కేవలం వీటికే సరిపోతుంది. కానీ ఆ 30 నిమిషాలు యాడ్స్ కి కేటాయిస్తే వారి సంస్థలకు రెవెన్యూ పెరుగుతుందని భావిస్తున్నారట.

First Published:  4 Sept 2019 9:58 AM IST
Next Story