యాషెస్ సిరీస్ లో టగ్-ఆఫ్-వార్
నేటినుంచే ఓల్డ్ ట్రాఫర్డ్ లో నాలుగోటెస్ట్ టాప్ ర్యాంకర్ గా తిరిగి స్టీవ్ స్మిత్ చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్- ఆస్ట్ర్రేలియా జట్ల పాంచ్ పటాకా యాషెస్ కమ్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ సిరీస్ నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది. సిరీస్ లోని మొదటి మూడుటెస్టులు ముగిసే సమయానికి రెండుజట్లు చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో సమరం హాట్ హాట్ గా మారింది. ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా మరికాసేపట్ల ప్రారంభమయ్యే నాలుగోటెస్ట్ రెండుజట్లకూ మాత్రమే కాదు…సిరీస్ కే కీలకంగా […]
- నేటినుంచే ఓల్డ్ ట్రాఫర్డ్ లో నాలుగోటెస్ట్
- టాప్ ర్యాంకర్ గా తిరిగి స్టీవ్ స్మిత్
చిరకాల ప్రత్యర్థులు ఇంగ్లండ్- ఆస్ట్ర్రేలియా జట్ల పాంచ్ పటాకా యాషెస్ కమ్ ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ సిరీస్ నువ్వానేనా అన్నట్లుగా సాగుతోంది.
సిరీస్ లోని మొదటి మూడుటెస్టులు ముగిసే సమయానికి రెండుజట్లు చెరో మ్యాచ్ నెగ్గి 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో సమరం హాట్ హాట్ గా మారింది.
ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా మరికాసేపట్ల ప్రారంభమయ్యే నాలుగోటెస్ట్ రెండుజట్లకూ మాత్రమే కాదు…సిరీస్ కే కీలకంగా మారింది. మెడకు గాయంతో మూడోటెస్ట్ కు దూరమైన స్టీవ్ స్మిత్ తిరిగి తుదిజట్టులో చేరడంతో విజయమే లక్ష్యంగా కంగారూ టీమ్ పోటీకి దిగుతోంది.
మరోవైపు…సూపర్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ తురుపుముక్కగా ఆతిథ్య ఇంగ్లండ్ వరుసగా రెండో విజయానికి ఉరకలేస్తోంది.
క్రెగ్ ఓవర్టన్, జాక్ లీచ్ లను ఇంగ్లండ్ బరిలోకి దించుతోంది. రోరీ బర్న్స్, జో డెన్లే ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించనున్నారు.
ఓపెనర్ గా వరుస వైఫల్యాలు ఎదుర్కొన్న జేసన్ రే ను నాలుగో డౌన్ లో దించాలని నిర్ణయించారు. ఇంగ్లండ్ మొత్తం ఏడుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ తో కంగారూ బౌలింగ్ ఎటాక్ కు సవాలు విసురుతోంది.
బ్యాటింగ్ కు అత్యంత అనువుగా ఉండే ఓల్డ్ ట్రాఫర్డ్ వికెట్ పై వచ్చే ఐదురోజులు స్పిన్నర్ల కంటే సీమ్ కమ్ పేస్ బౌలర్లే కీలకం కానున్నారు.
ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టుకే సిరీస్ కైవసం చేసుకొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆస్ట్ర్రేలియా జయాపజయాలలో మాజీ కెప్టెన్, ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ స్టీవ్ స్మిత్ మరోసారి నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నాడు.