Telugu Global
National

పశ్చిమ బెంగాల్ లో మూక దాడులకు మరణ శిక్ష

మాబ్ లించింగ్ (మూక దాడులు) పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పందించింది. మహమ్మద్ అఖ్లాక్ ఖాన్, పెహ్లూ ఖాన్ వంటి వారిపై జరిగిన మూక దాడులు మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిపోయాయి. ప్రభుత్వాలు గట్టి చట్టాలు తీసుకువచ్చి అమలు చేస్తే కానీ ఇటువంటి దాడులు ఆగవు. ఆ ఉద్దేశం తోనే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొత్తగా మాబ్ లించింగ్ కి వ్యతిరేకంగా ఒక బిల్లును అసంబ్లీ లో ప్రవేశపెట్టింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ […]

పశ్చిమ బెంగాల్ లో మూక దాడులకు మరణ శిక్ష
X

మాబ్ లించింగ్ (మూక దాడులు) పై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీవ్రంగా ప్రతిస్పందించింది. మహమ్మద్ అఖ్లాక్ ఖాన్, పెహ్లూ ఖాన్ వంటి వారిపై జరిగిన మూక దాడులు మానవత్వానికి మాయని మచ్చగా మిగిలిపోయాయి. ప్రభుత్వాలు గట్టి చట్టాలు తీసుకువచ్చి అమలు చేస్తే కానీ ఇటువంటి దాడులు ఆగవు. ఆ ఉద్దేశం తోనే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కొత్తగా మాబ్ లించింగ్ కి వ్యతిరేకంగా ఒక బిల్లును అసంబ్లీ లో ప్రవేశపెట్టింది.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును బిజెపి తప్ప మిగిలిన ప్రతిపక్షాలు అన్నీ ఆమోదించాయి. వెస్ట్ బెంగాల్ (ప్రివెన్షన్ ఆఫ్ లించింగ్) బిల్, 2019 అనే ఈ బిల్లు మూక దాడులకు కఠిన శిక్షలను ప్రతిపాదించింది. మాబ్ లించింగ్ కి పాల్పడిన వ్యక్తులకు జైలు శిక్ష తో పాటు మరణ శిక్షను కూడా విధించే అవకాశాన్ని ఈ బిల్లు లో పొందుపరిచారు.

ఎవరిపైనైనా మూక దాడులు చేసి గాయపరిస్తే అందుకు కారకులైనవారికి మూడేళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు విధిస్తారు. మూకదాడికి గురైన వ్యక్తులు మరణిస్తే… అందుకు కారకులైనవారికి ఆ జన్మ కఠిన కారాగార శిక్ష నుంచి మరణశిక్ష వరకు విధించే అవకాశం ఉంది.

ఈమధ్య రాజస్థాన్ కూడా మాబ్ లించింగ్ చేసే వారిపై లక్ష నుండి ఐదు లక్షల రూపాయల వరకు జరిమానా, జీవిత ఖైదు విధించేలా చట్టాన్ని చేసింది. ఇప్పటికే మణిపూర్ ఇటువంటి చట్టాన్ని తీసుకువచ్చింది.

First Published:  3 Sept 2019 12:04 PM IST
Next Story