Telugu Global
NEWS

టెస్ట్ క్రికెట్లో ధోనీని అధిగమించిన రిషభ్ పంత్

అత్యంత వేగంగా 50 మందిని అవుట్ చేసిన పంత్ భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ , 21 ఏళ్ల రిషభ్ పంత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మహేంద్ర సింగ్ పేరుతో గత దశాబ్దకాలంగా ఉన్న రికార్డును పంత్ తెరమరుగు చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీ 15 టెస్టుల్లో సాధించిన ఘనతను…రిషభ్ పంత్ కేవలం 11 టెస్టుల్లోనే సాధించి వారేవ్వా అనిపించుకొన్నాడు.  బ్యాటింగ్ లో వెలవెల..కీపింగ్ లో కళకళ.. ధోనీ వారసుడిగా భారత టెస్ట్ జట్టు వికెట్ […]

టెస్ట్ క్రికెట్లో ధోనీని అధిగమించిన రిషభ్ పంత్
X
  • అత్యంత వేగంగా 50 మందిని అవుట్ చేసిన పంత్

భారత యువ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ , 21 ఏళ్ల రిషభ్ పంత్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. మహేంద్ర సింగ్ పేరుతో గత దశాబ్దకాలంగా ఉన్న రికార్డును పంత్ తెరమరుగు చేశాడు.

మహేంద్ర సింగ్ ధోనీ 15 టెస్టుల్లో సాధించిన ఘనతను…రిషభ్ పంత్ కేవలం 11 టెస్టుల్లోనే సాధించి వారేవ్వా అనిపించుకొన్నాడు.

బ్యాటింగ్ లో వెలవెల..కీపింగ్ లో కళకళ..

ధోనీ వారసుడిగా భారత టెస్ట్ జట్టు వికెట్ కీపింగ్ పగ్గాలు చేపట్టిన రిషభ్ పంత్ బ్యాటింగ్ లో స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నా… వికెట్ కీపర్ గా మాత్రం సత్తా చాటుకొన్నాడు.

ప్రస్తుత కరీబియన్ టూర్ లో విండీస్ తో జరుగుతున్న రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ మొదటి మూడు ఇన్నింగ్స్ లో కలసి కేవలం 58 పరుగులతో 19.33 సగటు మాత్రమే సాధించిన పంత్… వికెట్ కీపర్ గా మాత్రం 8 క్యాచ్ లు పట్టాడు.

జమైకా టెస్ట్ మూడోరోజు ఆటలో విండీస్ ఓపెనర్ క్రెగ్ బ్రాత్ వెయిట్ ఇచ్చిన క్యాచ్ ను అందుకోడం ద్వారా..తన టెస్ట్ కెరియర్ లో 50మందిని అవుట్ చేసిన రికార్డు సాధించాడు.

ఈ క్రమంలో ధోనీపేరుతో ఉన్న రికార్డును అధిగమించాడు. ధోనీ 15 టెస్టుల్లో 50 మందిని అవుట్ చేయగలిగితే..పంత్ మాత్రం కేవలం 11 టెస్టుల్లోనే 50 క్యాచ్ లు, స్టంపింగ్స్ రికార్డు నమోదు చేశాడు.

ముగ్గురూ ముగ్గురే…

టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతితక్కువ టెస్టుల్లో 50 మందిని అవుట్ చేసిన వికెట్ కీపర్ల ప్రపంచ రికార్డు సౌతాఫ్రికాకు చెందిన మార్క్ బౌచర్, ఆస్ట్ర్రేలియా కెప్టెన్ టిమ్ పెయిన్, ఇంగ్లండ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టోల పేరుతో ఉంది.

ఈ ముగ్గురూ 10 టెస్ట్ మ్యాచ్ ల్లోనే 50 మందిని చొప్పున క్యాచ్ లు లేదా స్టంపింగ్స్ ద్వారా అవుట్ చేసిన ఘనతను సాధించారు.

First Published:  3 Sept 2019 3:50 AM IST
Next Story