రామసుబ్బారెడ్డి కూడా జంప్ ?
కడప జిల్లాలో టీడీపీ ఆనవాళ్లే ప్రశ్నార్థకం అవుతున్నాయి. షెల్టర్ కోసం కొందరు, రాజకీయ మనుగడ కోసం కొందరు పార్టీని వీడిపోతున్నారు. చంద్రబాబుకు గుండెకాయలా భావించిన సీఎం రమేషే బీజేపీలో చేరిపోవడంతో… కడప జిల్లా టీడీపీ నేతలు బిత్తరపోయారు. సీఎం రమేష్ పార్టీ వీడినప్పటి నుంచి కరుడుగట్టిన టీడీపీ నేతలు కూడా ఆలోచనలో పడ్డారు. చంద్రబాబు బినామీలే పార్టీ మారుతుంటే జిల్లాలో ఎదుగుబొదుగు లేని టీడీపీని నమ్ముకుని తామెందుకు త్యాగాలు చేయాలంటూ పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే మాజీ […]
కడప జిల్లాలో టీడీపీ ఆనవాళ్లే ప్రశ్నార్థకం అవుతున్నాయి. షెల్టర్ కోసం కొందరు, రాజకీయ మనుగడ కోసం కొందరు పార్టీని వీడిపోతున్నారు. చంద్రబాబుకు గుండెకాయలా భావించిన సీఎం రమేషే బీజేపీలో చేరిపోవడంతో… కడప జిల్లా టీడీపీ నేతలు బిత్తరపోయారు. సీఎం రమేష్ పార్టీ వీడినప్పటి నుంచి కరుడుగట్టిన టీడీపీ నేతలు కూడా ఆలోచనలో పడ్డారు.
చంద్రబాబు బినామీలే పార్టీ మారుతుంటే జిల్లాలో ఎదుగుబొదుగు లేని టీడీపీని నమ్ముకుని తామెందుకు త్యాగాలు చేయాలంటూ పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. లోకల్‌లో ఇబ్బందులు ఉన్నాయంటూ ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరబోతున్నారు. వైసీపీ నుంచి ఫిరాయించి వచ్చి మంత్రి పదవిని ఎంజాయ్ చేసి ఇప్పుడు కుంటిసాకులు చెప్పి సేఫ్‌గా బీజేపీలోకి వెళ్లేందుకు మంత్రి ఆదినారాయణరెడ్డి సిద్ధమవడంతో రామసుబ్బారెడ్డి కూడా ఆలోచనలో పడ్డట్టు చెబుతున్నారు.
ఆదినారాయణరెడ్డి ఎన్నికల సమయంలో పెట్టిన కండిషన్ కారణంగా ఎమ్మెల్సీ పదవిని కూడా పోగొట్టుకున్న రామసుబ్బారెడ్డి… ఇక టీడీపీలో ఉంటే భవిష్యత్తు ఉండదన్న నిర్ధారణకు వచ్చారని చెబుతున్నారు. ఆయన వైసీపీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
జగన్ ఇటీవల అమెరికా వెళ్లిన సమయంలో అక్కడే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరికపై చర్చలు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. నంద్యాల ప్రాంతానికి చెందిన ఒక వైసీపీ నేత ఈ విషయంలో మధ్యవర్తిత్వం వహించారని… త్వరలోనే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడం ఖాయమని చెబుతున్నారు.