నెల్లూరు మెస్‌లో టోకెన్లు అమ్ముకున్న చరిత్ర మరిచావా?
మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ మధ్య నిప్పు రాజుకుంది. తాను వైసీపీలోకి వెళ్లాలనుకుంటే ఎవడూ అడ్డుకోలేరని, అవంతిని తాను అసలు మంత్రిగానే చూడడం లేదని గంటా చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు. గంటా శ్రీనివాస్ అహంకారానికి ఆయన మాటలే నిదర్శనమన్నారు. తనను మంత్రిగా చూడడం లేదంటున్న గంటాను… తాను అసలు మనిషిగానే చూడడం లేదన్నారు అవంతి. నమ్మి అన్నం పెట్టే వారికి సున్నం పెట్టడం గంటాకు తొలి నుంచి అలవాటేనన్నారు. గంటా […]
మంత్రి అవంతి శ్రీనివాస్, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ మధ్య నిప్పు రాజుకుంది. తాను వైసీపీలోకి వెళ్లాలనుకుంటే ఎవడూ అడ్డుకోలేరని, అవంతిని తాను అసలు మంత్రిగానే చూడడం లేదని గంటా చేసిన వ్యాఖ్యలపై మంత్రి తీవ్రంగా స్పందించారు.
గంటా శ్రీనివాస్ అహంకారానికి ఆయన మాటలే నిదర్శనమన్నారు. తనను మంత్రిగా చూడడం లేదంటున్న గంటాను… తాను అసలు మనిషిగానే చూడడం లేదన్నారు అవంతి. నమ్మి అన్నం పెట్టే వారికి సున్నం పెట్టడం గంటాకు తొలి నుంచి అలవాటేనన్నారు. గంటా శ్రీనివాస్ ఎంత మందిని నమ్మించి మోసం చేశారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
టీడీపీలోకి రావడానికి అయ్యన్నపాత్రుడు సహకరిస్తే… ఇప్పుడు ఆయనకే ఎసరు పెట్టారని విమర్శించారు. ఎంతో మంది స్నేహితులను కూడా నమ్మించి మోసం చేసిన చరిత్ర గంటాకు ఉందన్నారు.
నెల్లూరు మెస్‌లో టికెట్లు అమ్ముకున్న చరిత్ర గంటా శ్రీనివాస్‌ది అన్నారు. చంద్రబాబుకు మైండ్ దెబ్బతిని ఇప్పటికీ తానే ముఖ్యమంత్రి అని అనుకుంటున్నారని… అదే విధంగా గంటా కూడా ఇప్పటికీ తానో మంత్రిని అని ఫీల్ అవుతున్నాడని ఎద్దేవా చేశారు. రాజకీయ బ్రోకర్‌కు ఉండాల్సిన అన్ని లక్షణాలు గంటాలో ఉన్నాయన్నారు.
టీడీపీలో ఎమ్మెల్యేగా ఉంటూ తాను వైసీపీలో చేరాలనుకుంటే ఎవరూ అడ్డుకోలేరంటూ గంటా వ్యాఖ్యానించడం బట్టే ఆయన ఒక రాజకీయ వ్యభిచారి అన్న అంశం స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
మొన్నటి ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు 14వందల ఓట్లతో గెలిచిన గంటా… ఇప్పుడు టీడీపీని కూడా మోసం చేసేందుకు సిద్ధమవుతున్నారన్నారు అవంతి.