Telugu Global
NEWS

నరసింహన్ తెలంగాణ వదిలేది లేదు.. కీలక పదవి ఇవ్వనున్న కేసీఆర్..?

తెలంగాణకు కొత్త గవర్నర్‌గా తమిళ ఇసై సౌందర్‌రాజన్ నియమింపబడటంతో సుదీర్ఘకాలం ఉమ్మడి ఏపీ, రెండు తెలుగ రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌ను వీడాల్సి ఉంది. స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసింహన్ ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇంత కాలం గవర్నర్‌గా కొనసాగించడమే ఆశ్చర్యకరమైన విషయం. కాగా, గతంలో ఐబీ ఛీఫ్‌గా పని చేసిన నరసింహన్ కు ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే […]

నరసింహన్ తెలంగాణ వదిలేది లేదు.. కీలక పదవి ఇవ్వనున్న కేసీఆర్..?
X

తెలంగాణకు కొత్త గవర్నర్‌గా తమిళ ఇసై సౌందర్‌రాజన్ నియమింపబడటంతో సుదీర్ఘకాలం ఉమ్మడి ఏపీ, రెండు తెలుగ రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌ను వీడాల్సి ఉంది. స్వతహాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసింహన్ ను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇంత కాలం గవర్నర్‌గా కొనసాగించడమే ఆశ్చర్యకరమైన విషయం.

కాగా, గతంలో ఐబీ ఛీఫ్‌గా పని చేసిన నరసింహన్ కు ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇన్నాళ్లు గవర్నర్ పదవిలో కొనసాగారనే ఊహాగానాలు ఉన్నాయి.

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కూడా గవర్నర్‌ నరసింహన్ ఏనాడు విభేదించలేదు. కేవలం మున్సిపల్ చట్టం విషయంలో తప్ప.. ఆయన కేసీఆర్ ప్రభుత్వానికి పూర్తి సహకారాన్ని అందించారు.

ఇక ఇప్పుడు రాజ్‌భవన్‌ను వీడాల్సి రావడంతో నరసింహన్ కు తెలంగాణ ప్రభుత్వంలో కీలక పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎంతో అనుభవం ఉన్న నరసింహన్ సేవలను మరి కొంత కాలం ఉపయోగించుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన నిన్న రాజ్‌భవన్‌కు వెళ్లి నరసింహన్ తో సుదీర్ఘంగా చర్చించారు.

ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా కలిగిన నరసింహన్ ను యాదాద్రి దేవాలయం పునర్ నిర్మాణం విషయంలో సలహాదారునిగా నియమించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేసిన వ్యక్తి మరి కేసీఆర్ ఆలోచనకు ఒప్పుకుంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒక వేళ ఒప్పుకుంటే మరి కొంత కాలం ఆయన తెలంగాణకు సేవలు అందిస్తారు.

First Published:  2 Sept 2019 1:28 AM GMT
Next Story