విండీస్ పై సిరీస్ విజయానికి భారత్ రెడీ
కరీబియన్ టీమ్ విజయలక్ష్యం 468 పరుగులు రెండోఇన్నింగ్స్ లో భారత్ 4 వికెట్లకు 168తో డిక్లేర్డ్ విండీస్ తో రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో క్లీన్ స్వీప్ కు భారత్ మార్గం సుగమం చేసుకొంది. తొలిఇన్నింగ్స్ లో విండీస్ పై భారీ ఆధిక్యం సాధించినా… ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడి… ప్రత్యర్థి ఎదుట 468 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచింది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెండోఇన్నింగ్స్ లో కరీబియన్ టీమ్ 2 వికెట్లకు 45 పరుగుల స్కోరుతో […]
- కరీబియన్ టీమ్ విజయలక్ష్యం 468 పరుగులు
- రెండోఇన్నింగ్స్ లో భారత్ 4 వికెట్లకు 168తో డిక్లేర్డ్
విండీస్ తో రెండుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో క్లీన్ స్వీప్ కు భారత్ మార్గం సుగమం చేసుకొంది. తొలిఇన్నింగ్స్ లో విండీస్ పై భారీ ఆధిక్యం సాధించినా… ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడి… ప్రత్యర్థి ఎదుట 468 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచింది.
మూడోరోజు ఆట ముగిసే సమయానికి రెండోఇన్నింగ్స్ లో కరీబియన్ టీమ్ 2 వికెట్లకు 45 పరుగుల స్కోరుతో ఉంది. ఓపెనర్లు కాంప్ బెల్ 16, బ్రాత్ వెయిట్ 3 పరుగులకు అవుట్ కాగా డారెన్ బ్రావో 18, బ్రూక్స్ 4 పరుగుల స్కోర్లతో క్రీజులో ఉన్నారు.
విరాట్ కొహ్లీ డకౌట్….
అంతకుముందు..విండీస్ ను తొలిఇన్నింగ్స్ లో 117 పరుగులకే కుప్పకూల్చిన భారత్…ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడాలని నిర్ణయించింది.
ఓపెనర్లు రాహుల్ 6, మయాంక్ అగర్వాల్ 4, కెప్టెన్ విరాట్ కొహ్లీ డకౌట్ గాను వెనుదిరిగారు. వన్ డౌన్ చతేశ్వర్ పూజారా 27 పరుగులకు అవుటయ్యాడు.
57 పరుగులకే 4 వికెట్లు నష్టపోయిన భారత్ ను…మిడిలార్డర్ ఆటగాళ్లు రహానే, హనుమ విహారీ 5వ వికెట్ కు 111 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొన్నారు.
భారత్ 4 వికెట్లకు 168 పరుగుల స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ప్రత్యర్థి ఎదుట 468 పరుగుల భారీలక్ష్యాన్ని ఉంచింది.
విండీస్ బౌలర్లలో రోచ్ వికెట్లు, హోల్డర్ 1 వికెట్ పడగొట్టారు.
టెస్ట్ ఆఖరి రెండురోజుల ఆటలో విండీస్ మరో 423 పరుగుల స్కోరు చేయాల్సి ఉంది. చేతిలో 8 వికెట్లు మాత్రమే ఉన్నాయి.
సిరీస్ లోని తొలిటెస్ట్ ను 318 పరుగులతో నెగ్గడం ద్వారా 60 పాయింట్లు సాధించిన భారత్… రెండోటెస్టులో సైతం భారీవిజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.