వారిని నమ్మొద్దు అంటున్న... 'ఆర్ ఆర్ ఆర్' నిర్మాతలు
మొన్నీమధ్యనే ‘బాహుబలి’ ఫీవర్ తగ్గింది అనుకుంటుండగా ఇప్పుడు అందరికీ ‘ఆర్ ఆర్ ఆర్’ ఫీవర్ పట్టుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై అంచనాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఇలాంటి సినిమాలో ఏదో ఒక రోల్ లో కనిపించాలని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు అదే విషయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని […]
మొన్నీమధ్యనే ‘బాహుబలి’ ఫీవర్ తగ్గింది అనుకుంటుండగా ఇప్పుడు అందరికీ ‘ఆర్ ఆర్ ఆర్’ ఫీవర్ పట్టుకుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాపై అంచనాలు కూడా ఎక్కువే ఉన్నాయి. అల్లూరి సీతారామరాజు గా రామ్ చరణ్ , కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఇలాంటి సినిమాలో ఏదో ఒక రోల్ లో కనిపించాలని చాలామంది అనుకుంటారు. ఇప్పుడు అదే విషయాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని కొందరు మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారట.
We want to caution everyone to be wary of such fraudulent casting calls. Communication on any aspect regarding our projects will come directly from our official SM channel. #RRR
— DVV Entertainment (@DVVMovies) September 1, 2019
ఈ విషయాన్ని సినిమా నిర్మాతలు డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. “గత కొంతకాలంగా కొందరు మోసగాళ్లు ఎస్ ఎస్ రాజమౌళి పేరుతో ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ మరియు ఇతర సోషల్ మీడియా అకౌంట్ల నుండి ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ కోసం కాస్టింగ్ కాల్స్ చేస్తున్నారని మాకు తెలిసింది. అందుకే అలా మోసపూరితమైన కాస్టింగ్ కాల్స్ ని నమ్మవద్దని మా మనవి. సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా కేవలం మా సోషల్ మీడియా ఛానెల్ నుండి మాత్రమే బయటకు వస్తుంది” అని క్లారిటీ ఇచ్చారు నిర్మాతలు.