టీఆర్ఎస్ ఎమ్మెల్యే తిరుగుబాటు
అనుకున్నట్టే అవుతోంది. రెండోసారి రెండో గళం వినిపించింది. మొన్నటికి మొన్న ఈటల రాజేందర్ తనను పార్టీలో అవమానిస్తున్నారని…. మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం మొదలు పెట్టారని కార్యకర్తల సమక్షంలో తన ఆవేదన వెళ్లగక్కారు. అయితే తాజాగా టీఆర్ఎస్ లో మరో తిరుగుబాటుకు నాంది పలికారు కాగజ్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. తాజాగా కోనేరు కోనప్ప జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించడం టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కోనేరు కోనప్పతోపాటు ఆయన […]
అనుకున్నట్టే అవుతోంది. రెండోసారి రెండో గళం వినిపించింది. మొన్నటికి మొన్న ఈటల రాజేందర్ తనను పార్టీలో అవమానిస్తున్నారని…. మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే ప్రచారం మొదలు పెట్టారని కార్యకర్తల సమక్షంలో తన ఆవేదన వెళ్లగక్కారు. అయితే తాజాగా టీఆర్ఎస్ లో మరో తిరుగుబాటుకు నాంది పలికారు కాగజ్ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప.
తాజాగా కోనేరు కోనప్ప జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించడం టీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే కోనేరు కోనప్పతోపాటు ఆయన అనుయాయులైన ఏడుగురు జడ్పీటీసీలు, ఏడుగురు ఎంపీపీలు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించడం కలకలం రేపింది.
దీనికంతటికి కారణం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ్ముడి పై…. గత నెల క్రితం ఫారెస్ట్ ఆఫీసర్ పై దాడి కేసులో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడమేనట. అధికార పార్టీలో ఉన్నా టీఆర్ఎస్ పెద్దలు ఇంత కఠువుగా వ్యవహరించడం చూసి కోనప్ప , ఆయన అనుచరగణమైన జడ్పీటీసీలు, ఎంపీపీలు జిల్లా సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించడం ఇప్పుడు టీఆర్ఎస్ లో కలకలం రేపుతోంది.
బీఎస్పీ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరాడు కోనేరు కోనప్ప. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అనుంగ అనుచరుడు. ఆయన అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఇప్పుడు గైర్హాజరవడం చూస్తే కోనప్ప టీఆర్ఎస్ కు దూరంగా జరుగుతున్నట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి.