Telugu Global
NEWS

సబైనా పార్క్ లో జస్ ప్రీత్ బుమ్రా విశ్వరూపం

జమైకా టెస్టులో బుమ్రా హ్యాట్రిక్ 16 పరుగులకే బుమ్రా 6 వికెట్లు భారత యువఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో తన తొలి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వికెట్లలో ఒకటిగా పేరుపొందిన కింగ్స్ టన్ సబైనా పార్క్ వేదికగా విండీస్ తో జరుగుతున్న రెండోటెస్ట్ రెండోరోజు ఆటలో చెలరేగిపోయాడు. వేగానికి స్వింగ్ ను జోడించి కరీబియన్ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలు చేశాడు. కేవలం 9.1 ఓవర్లలోనే 3 మేడిన్లతో […]

సబైనా పార్క్  లో జస్ ప్రీత్ బుమ్రా విశ్వరూపం
X
  • జమైకా టెస్టులో బుమ్రా హ్యాట్రిక్
  • 16 పరుగులకే బుమ్రా 6 వికెట్లు

భారత యువఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా సాంప్రదాయ టెస్ట్ క్రికెట్లో తన తొలి హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వికెట్లలో ఒకటిగా పేరుపొందిన కింగ్స్ టన్ సబైనా పార్క్ వేదికగా విండీస్ తో జరుగుతున్న రెండోటెస్ట్ రెండోరోజు ఆటలో చెలరేగిపోయాడు.

వేగానికి స్వింగ్ ను జోడించి కరీబియన్ బ్యాటింగ్ ఆర్డర్ ను కకావికలు చేశాడు. కేవలం 9.1 ఓవర్లలోనే 3 మేడిన్లతో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.

భారత భారీ తొలిఇన్నింగ్స్ స్కోరు 416 పరుగులకు సమాధానంగా బ్యాటింగ్ కు దిగిన విండీస్ టీమ్ ను బుమ్రా దెబ్బ మీద దెబ్బ కొట్టి కోలుకోనివ్వకుండా చేశాడు.

వరుస బంతుల్లో వికెట్లు తీసి టాపార్డర్ ను కకావికలు చేశాడు. రెండోరోజుఆట ముగిసే సమయానికే విండీస్ 7 వికెట్లకు 87 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొత్తం 7 వికెట్లకు 6 వికెట్లు బుమ్రానే పడగొట్టడం విశేషం.

బుమ్రా హ్యాట్రిక్…

ఆట 9వ ఓవర్లలో బుమ్రా వరుస బంతుల్లోముగ్గురు టాపార్డర్ బ్యాట్స్ మన్ ను పెవీలియన్ దారిపట్టించడం ద్వారా తన కెరియర్ లో తొలి టెస్ట్ హ్యాట్రిక్ నమోదు చేశాడు.

9వ ఓవర్ రెండో బంతికి డారెన్ బ్రావో, మూడో బంతికి బ్రూక్స్, నాలుగో బంతికి రోస్టన్ చేజ్ లను బుమ్రా పడగొట్టడం ద్వారా హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

భారత మూడో బౌలర్ బుమ్రా…

ఎనిమిది దశాబ్దాల భారత టెస్ట్ చరిత్రలో హ్యాట్రిక్ సాధించిన మూడో బౌలర్ గా జస్ ప్రీత్ బుమ్రా రికార్డుల్లో చేరాడు. బుమ్రాకు ముందే ఇదే ఘనత సాధించిన భారత బౌలర్లలో హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పటాన్ ఉన్నారు.

కోల్ కతా వేదికగా ఆస్ట్ర్రేలియాతో ముగిసిన టెస్ట్ మ్యాచ్ లో ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హ్యాట్రిక్ సాధించడం ద్వారా…టెస్ట్ క్రికెట్లో హ్యాట్రిక్ సాధించిన భారత తొలిబౌలర్ గా నిలిచాడు.

పాకిస్థాన్ ప్రత్యర్థిగా ఇర్ఫాన్ పటాన్ సైతం హ్యాట్రిక్ నమోదు చేశాడు. భారత రెండో హ్యాట్రిక్ బౌలర్ గా నిలిచాడు.

ప్రస్తుత విండీస్ సిరీస్ రెండోటెస్టులో బుమ్రా హ్యాట్రిక్ సాధించడం ద్వారా భారత మూడోబౌలర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

First Published:  1 Sept 2019 11:35 AM IST
Next Story