Telugu Global
NEWS

కేసీఆర్ కు పోటు... దత్తాత్రేయకు స్వీటు

కేంద్రం అనుకున్నంత పని చేసింది. తెలంగాణపై పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఏపీకి నూతన గవర్నర్ ను నియమించిన కేంద్రం యూపీఏ హయాంలో నియమితుడైన తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను మార్చేసి తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాజకీయాల్లో పట్టు సంపాదించాలని చూస్తున్న బీజేపీకి ఇప్పుడు తెలంగాణ గవర్నర్ గా తమ అనుంగ శిష్యులు ఉండడం అత్యవసరమని భావించింది. అందుకే తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు సౌందర రాజన్ ను ఏరికోరి కేసీఆర్ […]

కేసీఆర్ కు పోటు... దత్తాత్రేయకు స్వీటు
X

కేంద్రం అనుకున్నంత పని చేసింది. తెలంగాణపై పట్టు సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఏపీకి నూతన గవర్నర్ ను నియమించిన కేంద్రం యూపీఏ హయాంలో నియమితుడైన తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను మార్చేసి తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ రాజకీయాల్లో పట్టు సంపాదించాలని చూస్తున్న బీజేపీకి ఇప్పుడు తెలంగాణ గవర్నర్ గా తమ అనుంగ శిష్యులు ఉండడం అత్యవసరమని భావించింది.

అందుకే తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు సౌందర రాజన్ ను ఏరికోరి కేసీఆర్ నెత్తిన పెట్టింది. గవర్నర్ నరసింహన్ ఈ ఐదేళ్లు కేసీఆర్ తో ఎంత సాన్నిహిత్యంగా వ్యవహరించారో తెలిసిందే. ఒక్క మున్సిపల్ చట్టాన్ని వెనక్కి పంపడం తప్పితే ఎలాంటి చర్యా తీసుకోలేదు. అదీ కేంద్రంలోని బీజేపీ నేతల ఒత్తిడితోనే చేసినట్లు సమాచారం.

ఇప్పుడు కేసీఆర్ తీసుకునే ప్రభుత్వ నిర్ణయాలను బీజేపీ నియమించిన గవర్నర్ సౌందర రాజన్ ఏకపక్షంగా ఆమోదించే అవకాశాలు లేవు. మరి కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారన్నది వేచిచూడాలి.

కాగా సీనియర్ బీజేపీ నేత, మాజీ కేంద్రమంత్రి దత్తాత్రేయను కూడా కేంద్రం కనికరించింది. ఆయనను ఏకంగా హిమాచల్ ప్రదేశ్ కు గవర్నర్ గా పంపి తీపి కబురును అందించింది.

అప్పట్లో హైదరాబాద్ యూనివర్సిటీ విద్యార్థి విషయంలో తలదూర్చి విమర్శలు ఎదుర్కొని దత్తాత్రేయ కేంద్ర మంత్రి పదవిని పోగొట్టుకున్నారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత గవర్నర్ పదవి పొందడంతో ఆయనతోపాటు ఆయన అనుచరులు హ్యాపీగా ఉన్నారు.

దీంతో కేంద్రంలోని బీజేపీ తెలంగాణలో కేసీఆర్ కు పోటు… దత్తాత్రేయకు స్వీటు ఇచ్చినట్లైందని కొందరు అంటున్నారు.

First Published:  1 Sept 2019 11:45 AM IST
Next Story