ఏపీలో టన్ను ఇసుక 375 రూపాయలే...
ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని సిద్ధం చేసింది. సెప్టెంబర్ 5 నుంచి అది అందుబాటులోకి రాబోతోంది. ఇసుక మాఫియాకు చెక్ పెట్టేలా, ప్రజలకు తక్కువ ధరకే ఇసుక అందేలా… అదే సమయంలో ఆ ఆదాయం నేరుగా ప్రభుత్వానికే వచ్చేలా పాలసీని రూపొందించారు. ఈ పాలసీ పక్కాగా అమలు అయితే ఇసుక మాఫియాకు మనుగడ లేనట్టే. స్టాక్ యార్డుల నుంచి టన్ను ఇసుకను లోడింగ్ ఫీజుతో కలిపి కేవలం 375 రూపాయలకే ప్రజలకు అందించనున్నారు. ఒకటి రెండు […]
ఏపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీని సిద్ధం చేసింది. సెప్టెంబర్ 5 నుంచి అది అందుబాటులోకి రాబోతోంది. ఇసుక మాఫియాకు చెక్ పెట్టేలా, ప్రజలకు తక్కువ ధరకే ఇసుక అందేలా… అదే సమయంలో ఆ ఆదాయం నేరుగా ప్రభుత్వానికే వచ్చేలా పాలసీని రూపొందించారు. ఈ పాలసీ పక్కాగా అమలు అయితే ఇసుక మాఫియాకు మనుగడ లేనట్టే. స్టాక్ యార్డుల నుంచి టన్ను ఇసుకను లోడింగ్ ఫీజుతో కలిపి కేవలం 375 రూపాయలకే ప్రజలకు అందించనున్నారు.
ఒకటి రెండు రోజుల్లోనే పాలసీ విధానాలను అధికారికంగా ప్రకటించనున్నారు. నూతన విధానంలో ఏపీఎండీసీ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే డబ్బు చెల్లించిన వారికి నేరుగా స్టాక్ యార్డు నుంచి ఇసుకను వాహనంలో తెచ్చి ఇంటి వద్ద అందజేస్తారు. ఇసుక తరలింపు వాహనాల ఖర్చు కిలోమీటర్‌కు రూ. 4.90లోపే ఉండాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచించింది. జీపీఎస్ ఉన్న వాహనాలను, భూగర్భ గనుల శాఖ వద్ద రిజిస్టర్ చేసుకున్న వాహనాలను మాత్రమే స్టాక్ యార్డుల నుంచి ఇసుక సరఫరా చేసేందుకు అనుమతిస్తారు.
పర్యావరణ నిబంధనావళి ప్రకారం రీచ్‌లలో యంత్రాలు వినియోగించకుండా కూలీలతోనే ఇసుక తవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. తెలంగాణలో టన్ను ఇసుకను ప్రస్తుతం 400కు సరఫరా చేస్తున్నారు. ఏపీలో మాత్రం 375 రూపాయలకు అందించనున్నారు. ఇసుకను రీచ్‌ల నుంచి స్టాక్ యార్డులకు చేరవేసి, అక్కడి నుంచి ప్రజలకు అందించడానికి మొత్తం నిర్వహణ వ్యయం, పన్నులు కలిపి టన్నుకు దాదాపు రూ.225 ఖర్చవుతుందని అధికారులు లెక్కగట్టారు.
రీచ్‌లో ఇసుకను తవ్వి స్టాక్ యార్డుకు చేరవేయడానికి కాంట్రాక్టర్లకు ఇచ్చే మొత్తమే టన్నుకు రూ.100 గా ఉంటుంది.. ఒక్కో స్టాక్ యార్డులో 14 మంది ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వాల్సి ఉంటుంది. టన్ను ఇసుకకు యార్డుల నిర్వహణకు సగటున రూ.30, జీఎస్‌టీ రూ.22, సీనరేజి రూ.33, జిల్లా మినరల్ ఫండ్(డీఎంఎఫ్) రూ.10, మెరిట్, ఐటీ, ఇతరత్రా అన్నీ కలిపితే అయ్యే వ్యయం రూ.225. స్టాక్ యార్డుల్లో టన్ను ఇసుక రూ.375కు విక్రయిస్తే ఖర్చులు పోను ప్రభుత్వానికి రూ.150 మిగులుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.