చంద్రబాబు పెంపుడు కుక్కలను గొలుసులు విప్పి వదిలేశారు...
చంద్రబాబు పెంచి పోషించిన ఇసుక మాఫియా ఇప్పుడు కలుగులో నుంచి బయటపడ్డ ఎలుకలా కొట్టుకుంటోందని ఎద్దేవా చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇసుక మాఫియా ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు మాత్రం నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని, దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని విమర్శించారు. మరో వారం రోజుల్లో కొత్త ఇసుక విధానం వస్తుందని… అప్పుడు దళారులు లేకుండా నేరుగా ఇసుక అమ్మకాలు సాగుతాయని వివరించారు. రాజధాని ప్రాంతాన్ని వరదలు ముంచెత్తినప్పటి నుంచి చంద్రబాబుకు దయ్యం పట్టిందన్నారు. రాజధాని ప్రాంతంలో […]
చంద్రబాబు పెంచి పోషించిన ఇసుక మాఫియా ఇప్పుడు కలుగులో నుంచి బయటపడ్డ ఎలుకలా కొట్టుకుంటోందని ఎద్దేవా చేశారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి.
ఇసుక మాఫియా ఇబ్బంది పడుతుంటే చంద్రబాబు మాత్రం నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని, దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని విమర్శించారు.
మరో వారం రోజుల్లో కొత్త ఇసుక విధానం వస్తుందని… అప్పుడు దళారులు లేకుండా నేరుగా ఇసుక అమ్మకాలు సాగుతాయని వివరించారు.
రాజధాని ప్రాంతాన్ని వరదలు ముంచెత్తినప్పటి నుంచి చంద్రబాబుకు దయ్యం పట్టిందన్నారు. రాజధాని ప్రాంతంలో వందల కోట్లు పెట్టి భూములు కొనుగోలు చేసిన తన బినామీలు, బంధువులు ఏమైపోతారో అని చంద్రబాబుకు బెంగపట్టుకుందన్నారు. ప్రతిపక్ష నేతగా కాకుండా చంద్రబాబు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిలా తాటాకు చప్పుళ్లు చేస్తున్నారని విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు.
చంద్రబాబు తన ఇంట్లో కట్టేసిన పెంపుడు కుక్కలన్నింటికి గొలుసులు విప్పి వదిలేశారని… అవి దారిన పోయే వాళ్లందరి వెంట పడుతున్నాయని ట్వీట్ చేశారు. చంద్రబాబు ఉస్కో అనగానే మొరగటమొక్కటే ఆ పెంపుడు కుక్కలకు తెలుసు అని ఎద్దేవా చేశారు.
రాజధాని ప్రాంతాన్ని వరద ముంచెత్తినప్పటి నుంచి @ncbn గారు దెయ్యం పట్టిన వాడిలా మారిపోయారు.భూములపై వందల కోట్లు పెట్టుబడి పెట్టిన తన బినామీలు, బంధువర్గం పరిస్థితి ఏమవుతుందనే బెంగ పట్టుకుంది.ప్రతిపక్ష నేత అయి ఉండీ రియల్ ఎస్టేట్ వ్యాపారిలా తాటాకు చప్పుళ్లు చేయిస్తున్నారు. @naralokesh
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 31, 2019
ఇంట్లో కట్టేసిన పెంపుడు కుక్కలన్నింటినీ గొలుసులు విప్పి వదిలేశారు తండ్రీ కొడుకులు. అవి దారిన పోయే వాళ్ళందరి వెంట పడుతున్నాయి. ఈయన ఉస్కో అంటే మొరగటమొక్కటే తెలుసు వాటికి. మొరిగే కుక్కలను తరిమికొట్టిన తర్వాత తమకు బడితె పూజేనని మర్చి పోయినట్టున్నారు. @ncbn @naralokesh @JaiTDP
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 31, 2019