Telugu Global
NEWS

ఆంధ్రా బ్యాంకు విలీనం తెలుగువారి మనోభావాలను దెబ్బతీస్తోంది

ప్రభుత్వ బ్యాంకుల విలీనంలో భాగంగా ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం విలీనం చేసింది. దీంతో తెలుగు వారికి సంబంధించిన ఏకైక బ్యాంకు కూడా కనుమరుగు అయింది. ఈ పని ఆంధ్రా కోడలు నిర్మలా సీతారామన్‌ చేతుల మీదుగానే జరిగింది. అయితే ఆంధ్రా బ్యాంకు ఉనికి లేకుండా చేయడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వైసీపీ ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. […]

ఆంధ్రా బ్యాంకు విలీనం తెలుగువారి మనోభావాలను దెబ్బతీస్తోంది
X

ప్రభుత్వ బ్యాంకుల విలీనంలో భాగంగా ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో కేంద్ర ప్రభుత్వం విలీనం చేసింది. దీంతో తెలుగు వారికి సంబంధించిన ఏకైక బ్యాంకు కూడా కనుమరుగు అయింది. ఈ పని ఆంధ్రా కోడలు నిర్మలా సీతారామన్‌ చేతుల మీదుగానే జరిగింది. అయితే ఆంధ్రా బ్యాంకు ఉనికి లేకుండా చేయడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రా బ్యాంకు విలీనాన్ని వ్యతిరేకిస్తూ ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వైసీపీ ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. ఆంధ్రా బ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయవద్దని లేఖలో కోరారు. ఈ విలీనం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని బాలశౌరి అభిప్రాయపడ్డారు.

ఒకవేళ తప్పనిసరిగా విలీనం చేయాల్సి వస్తే ఆంధ్రా బ్యాంకు పేరుతోనే విలీన అనంతర బ్యాంకు ఉండేలా చూడాలని కోరారు. విలీనం తర్వాత ఆంధ్రా బ్యాంకుగానే పేరు ఉంచి ఆ బ్యాంకు హెడ్ క్వార్టర్‌ను ఏపీలో ఏర్పాటు చేయాలని బాలశౌరి డిమాండ్ చేశారు.

First Published:  31 Aug 2019 10:43 AM IST
Next Story