ఈ-టికెట్ బుకింగ్‌పై... రైల్వే శాఖ అదనపు బాదుడు
ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్వే ఈ-టికెట్లు బుక్ చేసే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ ఒకటి నుంచి అంటే… ఆదివారం నుంచి రైల్వే ఈ- టికెట్లపై సర్వీస్ చార్జ్‌ను బాదబోతున్నారు. నాన్ ఏసీ టికెట్‌పై రూ. 15, ఏసీ టికెట్‌పై రూ. 30 చొప్పున సర్వీస్ చార్జ్ వసూలు చేస్తారు. ఈ వడ్డనకు జీఎస్‌టీ అదనంగా ఉంటుంది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తామంటూ మూడేళ్ల క్రితం మోడీ సర్కారే ఈ చార్జీలను ఎత్తివేసింది. కానీ ఇప్పుడు తిరిగి […]
ఐఆర్‌సీటీసీ ద్వారా రైల్వే ఈ-టికెట్లు బుక్ చేసే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ ఒకటి నుంచి అంటే… ఆదివారం నుంచి రైల్వే ఈ- టికెట్లపై సర్వీస్ చార్జ్‌ను బాదబోతున్నారు.
నాన్ ఏసీ టికెట్‌పై రూ. 15, ఏసీ టికెట్‌పై రూ. 30 చొప్పున సర్వీస్ చార్జ్ వసూలు చేస్తారు. ఈ వడ్డనకు జీఎస్‌టీ అదనంగా ఉంటుంది.
డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తామంటూ మూడేళ్ల క్రితం మోడీ సర్కారే ఈ చార్జీలను ఎత్తివేసింది. కానీ ఇప్పుడు తిరిగి తీసుకురావడం ద్వారా డిజిటల్ హామీ విషయంలో కేంద్రం వెనక్కు వెళ్తున్నట్టుగా భావిస్తున్నారు.
ఈ- టికెట్ బుకింగ్‌పై సర్వీస్ చార్జ్ తీసివేసిన తర్వాత ఐఆర్‌సీటీసీ ద్వారా వచ్చే ఆదాయంలో 26 శాతం గండిపడిందని…. అందుకే తిరిగి సర్వీస్ చార్జ్‌లను విధిస్తున్నట్టు రైల్వే అధికారులు చెబుతున్నారు.