Telugu Global
Cinema & Entertainment

ఇటలీలో చాణక్య ఆటాపాట

గోపీచంద్ అప్ కమింగ్ మూవీ చాణక్య. ఈ సినిమాకు సంబంధించి టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పాటల షూటింగ్ నడుస్తోంది. ఇందులో భాగంగా యూనిట్ మొత్తం ఇటలీ వెళ్లింది. మిలాన్ లోని కొన్ని అందమైన లొకేషన్లలో హీరో గోపీచంద్, హీరోయిన్ మెహ్రీన్ మధ్య ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ పాటతో పాటు ఇటలీలోనే మరో పాటను కూడా షూట్ చేయబోతున్నారు. ఈ రెండు సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత యూనిట్ హైదరాబాద్ తిరిగొస్తుంది. […]

ఇటలీలో చాణక్య ఆటాపాట
X

గోపీచంద్ అప్ కమింగ్ మూవీ చాణక్య. ఈ సినిమాకు సంబంధించి టాకీ పార్ట్ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పాటల షూటింగ్ నడుస్తోంది. ఇందులో భాగంగా యూనిట్ మొత్తం ఇటలీ వెళ్లింది. మిలాన్ లోని కొన్ని అందమైన లొకేషన్లలో హీరో గోపీచంద్, హీరోయిన్ మెహ్రీన్ మధ్య ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ పాటతో పాటు ఇటలీలోనే మరో పాటను కూడా షూట్ చేయబోతున్నారు.

ఈ రెండు సాంగ్స్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత యూనిట్ హైదరాబాద్ తిరిగొస్తుంది. అన్నపూర్ణలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో మరో సాంగ్ ను షూట్ చేస్తారు. ఈ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తారు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు తిరు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అండర్ కవర్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు గోపీచంద్. ఉగ్రవాదం, ఆర్థికనేరాలు, దేశభక్తి లాంటి ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. గతంలో ఈ సినిమా షూటింగ్ లో గోపీచంద్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ గాయం నుంచి ఈ హీరో ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు.

First Published:  31 Aug 2019 12:42 PM IST
Next Story