ఆంధ్రాలోనూ.... ఇంటింటికి తాగునీరు
మిషన్ భగీరథ పేరుతో ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక సంస్థలకు అవసరమైన నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ‘మిషన్ భగీరథ’. ప్రాజెక్టులు కట్టి అక్కడి నుంచి తెలంగాణ ప్రజలకు ఉచితంగా ఫిల్టర్ చేసిన సురక్షిత నీరును అందించే ఈ గొప్ప పథకంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి. ఈ మేటి పథకాన్ని ఏపీలోనూ అమలు చేయాలని తాజాగా ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. కలుషిత నీరు కారణంగా ఏపీలో ఎంతోమంది వ్యాధులకు గురవుతున్నారు. సీమలో నీరు […]
మిషన్ భగీరథ పేరుతో ప్రజలకు తాగునీరు, పారిశ్రామిక సంస్థలకు అవసరమైన నీటిని అందించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం ‘మిషన్ భగీరథ’. ప్రాజెక్టులు కట్టి అక్కడి నుంచి తెలంగాణ ప్రజలకు ఉచితంగా ఫిల్టర్ చేసిన సురక్షిత నీరును అందించే ఈ గొప్ప పథకంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిశాయి.
ఈ మేటి పథకాన్ని ఏపీలోనూ అమలు చేయాలని తాజాగా ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు.
కలుషిత నీరు కారణంగా ఏపీలో ఎంతోమంది వ్యాధులకు గురవుతున్నారు. సీమలో నీరు దొరక్క అల్లాడుతున్నారు. ఇక ఉద్దానంలో కలుషిత నీటి వల్లే కిడ్నీ సమస్య వచ్చింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఏపీ వాటర్ గ్రిడ్ పథకంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
నిధుల లభ్యత, ఆర్థిక స్థితి దృష్ట్యా ఈ పథకాన్ని మూడు దశల్లో అమలు చేయాలని జగన్ నిర్ణయించారు. నీటి సమస్య ఎక్కువగా ఉన్న మూడు జిల్లాల్లో మొదటగా ఈ వాటర్ గ్రిడ్ పథకాన్ని చేపట్టాలని జగన్… అధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు మొదటి దశలో శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు ప్రకాశం జిల్లాలో వాటర్ గ్రిడ్ తొలుత అమలు కానుంది.
ఇక రెండో దశలో విశాఖ, చిత్తూరు, విజయనగరం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తారు. మూడో దశలో కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలకు విస్తరిస్తారు.
కిడ్నీ వ్యాధులు ఎక్కువగా ఉన్న ఉద్దానంలాంటి ప్రాంతాల్లో నీటి శుద్ధి యంత్రాల నుంచి నేరుగా ప్రజల ఇంటికే శుద్ధి చేసిన నీరును సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయాలని జగన్ ఆదేశించారు.