Telugu Global
NEWS

కర్నూలుకు హైకోర్టు... జగన్ నిర్ణయం

అన్నీ తీసుకెళ్లి అమరావతిలోనే పెట్టాలన్న చంద్రబాబు కేంద్రీకరణ ఉద్దేశాలకు భిన్నంగా కొత్త ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. అభివృద్దిని, ప్రభుత్వ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గించే ఆలోచనతో ముందుకెళ్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో కథనం వచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సన్నిహితులే చెప్పినట్టు వెల్లడించింది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా హైకోర్టును కర్నూలులో ఏర్పాటు […]

కర్నూలుకు హైకోర్టు... జగన్ నిర్ణయం
X

అన్నీ తీసుకెళ్లి అమరావతిలోనే పెట్టాలన్న చంద్రబాబు కేంద్రీకరణ ఉద్దేశాలకు భిన్నంగా కొత్త ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నారు. అభివృద్దిని, ప్రభుత్వ సంస్థలను వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం ద్వారా ప్రాంతాల మధ్య అసమానతలు తగ్గించే ఆలోచనతో ముందుకెళ్తున్నారు.

తాజాగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో కథనం వచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సన్నిహితులే చెప్పినట్టు వెల్లడించింది. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయడంతో పాటు… హైకోర్టు బెంచ్‌ ను విశాఖలో ఏర్పాటు చేయాలని జగన్‌ నిర్ణయించారని కథనం. ఈ అంశంపై ఇటీవల ఢిల్లీకి వెళ్లినప్పుడు అమిత్ షాతోనూ జగన్ చర్చించినట్టు ముఖ్యమంత్రి సన్నిహితులు చెప్పారని వెల్లడించింది.

అమరావతిలోనే సచివాలయం, అసెంబ్లీ, రాజ్‌భవన్‌ను ఉంచడం ద్వారా దాన్ని పరిపాలన రాజధానిగా ఉంచనున్నారు. మిగిలిన ప్రభుత్వ కార్యాలయాలు, డైరెక్టరేట్లు, కమిషనరేట్లను రాష్ట్ర వ్యాప్తంగా సమదృష్టితో వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయబోతున్నారు.

ఒకప్పుడు ఏపీ రాజధానిగా ఉన్న కర్నూలును…. పూర్తిగా గత ప్రభుత్వం విస్మరించిందన్న ఆవేదన ఆ ప్రాంత ప్రజల్లో ఉంది. దాంతో అలాంటి భావనను తొలగించేందుకు కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు జగన్ నిర్ణయించారని చెబుతున్నారు.

ఉత్తరాంధ్ర ప్రజలకు హైకోర్టు దూరం అవుతున్న భావన లేకుండా ఉండేందుకు విశాఖలో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయబోతున్నారట.

First Published:  31 Aug 2019 5:21 AM IST
Next Story