Telugu Global
NEWS

పైన 4 అడుగులు నల్ల మట్టి... తర్వాత 10 అడుగులు ఇసుక... ఆ తర్వాత మొత్తం నీరు " రాజధాని ప్రజల వాయిస్‌ ఇది

గతంలో టీడీపీ ప్రభుత్వమే వివిధ వేదికల మీద అంగీకరించినట్టుగానే అమరావతి ముంపు ప్రాంతం అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పగానే చంద్రబాబు, ఆయన మద్దతుదారులంతా రాజధాని ప్రాంతానికి క్యూ కడుతున్నారు. రైతుల తరపున పోరాటం అంటూ అమరావతిలోనే నిర్మాణాలు సాగాలి అని ఆందోళన చేస్తున్నారు. చంద్రబాబుకు ఆపద వస్తే వెంటనే రంగంలోకి దిగుతారని ఇప్పటికే అనేక ఉదంతాల్లో విమర్శలు ఎదుర్కొన్న పవన్‌ కల్యాణ్ కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించారు. గతంలో అనంతపురం బహిరంగ సభలో మాట్లాడుతూ…. అమరావతి […]

పైన 4 అడుగులు నల్ల మట్టి... తర్వాత 10 అడుగులు ఇసుక... ఆ తర్వాత మొత్తం నీరు  రాజధాని ప్రజల వాయిస్‌ ఇది
X

గతంలో టీడీపీ ప్రభుత్వమే వివిధ వేదికల మీద అంగీకరించినట్టుగానే అమరావతి ముంపు ప్రాంతం అని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పగానే చంద్రబాబు, ఆయన మద్దతుదారులంతా రాజధాని ప్రాంతానికి క్యూ కడుతున్నారు. రైతుల తరపున పోరాటం అంటూ అమరావతిలోనే నిర్మాణాలు సాగాలి అని ఆందోళన చేస్తున్నారు.

చంద్రబాబుకు ఆపద వస్తే వెంటనే రంగంలోకి దిగుతారని ఇప్పటికే అనేక ఉదంతాల్లో విమర్శలు ఎదుర్కొన్న పవన్‌ కల్యాణ్ కూడా రాజధాని ప్రాంతంలో పర్యటించారు.

గతంలో అనంతపురం బహిరంగ సభలో మాట్లాడుతూ…. అమరావతి ఒక కులం వారి కోసం చంద్రబాబు కడుతున్నారని విమర్శించిన పవన్ కల్యాణ్… ఇప్పుడు మాత్రం రాజధాని ఇక్కడే ఉండాలంటున్నారు. నన్నేమైనా అంటే మా నాన్నకు చెబుతా అని స్కూల్ పిల్లలు అన్నట్టుగా… జగన్‌ మోహన్ రెడ్డి రాజధాని విషయంలో తమ మాట వినకుంటే తాను వెళ్ళి మోడీని, అమిత్ షాను కలుస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు.

అయితే పవన్‌ కల్యాణ్ పర్యటనపై ఒక చానల్ చర్చా కార్యక్రమం నిర్వహించింది. రాజధాని ప్రాంత రైతుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంది. ఉండవల్లికి చెందిన సాంబయ్య, జగ్గయ్యపేటకు చెందిన నాగేశ్వరరావు, నిడమర్రు గ్రామానికి చెందిన శేషిరెడ్డిలు రాజధాని ప్రాంత వాస్తవ పరిస్థితులను వివరించారు.

సాంబయ్య… ఉండవల్లి….

”పవన్‌ కల్యాణ్ తాను చెబితేనే చంద్రబాబు ఐదు గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కు తీసుకున్నారని చెప్పారు. కానీ అది అవాస్తవం. 300 మంది రైతులం కోర్టుకు వెళ్లి మావి మూడు పంటలు పండే భూములని నిరూపించిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకే ప్రభుత్వం మా గ్రామాల్లో భూసేకరణకు వెనక్కు తగ్గింది.

రైతులు మునిగిపోతున్నప్పుడు పవన్‌ కల్యాణ్ ఎక్కడున్నారు?. ప్రశాంతంగా ఉన్న రైతులను ఇబ్బంది పెట్టేందుకు ఇప్పుడు నేతలంతా రాజధాని పర్యటనలకు వస్తున్నారు. భూములు కొన్న బినామీలు ఇబ్బందిపడుతున్నారన్న ఉద్దేశంలోనే పవన్‌ కల్యాణ్ వచ్చినట్టుగా ఉంది. కొండవీటివాగు వల్ల ముంపు అన్నది నిజం. మొన్న వరదలు వచ్చినప్పుడు కూడా పోలీసులు వచ్చి… వరద వస్తే ఎవరైనా కొట్టుకుపోతుంటే రక్షించేందుకు సహకరించాలని మమ్మల్ని కోరారు”.

నాగేశ్వరరావు… జగ్గయ్యపేట

”ఇక్కడ తవ్వితే తొలుత నాలుగు అడుగులు నల్ల మట్టి వస్తుంది. ఆ తర్వాత 10 అడుగులు ఇసుక వస్తుంది. 15 అడుగులు దాటితే మొత్తం నీరే. ఇలాంటి చోట నిర్మాణాలు కట్టాలంటే వేల కోట్లు వృథా అవుతాయి. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్ ఇద్దరూ ఒకేలా మాట్లాడుతున్నారు. వారిద్దరూ ఒకటే” అని అన్నారు.

శేషిరెడ్డి, నిడమర్రు గ్రామం

”మా ఊరికి పవన్‌ కల్యాణ్ వచ్చారు. భూములను ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగారు. వెనక్కు ఇస్తే రైతులు వ్యవసాయం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పాం. మా గ్రామాలకు కొండవీటి వాగు వల్ల వరద ప్రమాదం ఉంది. చంద్రబాబు అదృష్టం కొద్ది గడిచిన ఐదేళ్లలో వానలు రాలేదు, వరదలు రాలేదు. అందుకే రాజధానిలో వరద ముంపు గురించి బయటకు తెలియలేదు. కానీ వరద ముప్పు ఉంది”.

పాపారావు, ఆర్థిక రంగ నిపుణుడు

చర్చలో పాల్గొన్న ఆర్థిక రంగ నిపుణులు పాపారావు తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ” చర్చలో పాల్గొన్న రాజధాని ప్రాంత ప్రజలు అక్కడున్న స్థానిక వాస్తవాలను చెబుతున్నారు. నేతలు మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. వరద వచ్చినప్పుడు పోలీసులు వచ్చి ఎవరైనా కొట్టుకుపోతే రక్షించేందుకు సిద్ధంగా ఉండాలి అని స్థానికులకే చెప్పారంటే అక్కడ ముంపు ప్రమాదం ఉంది అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. తవ్వితే నాలుగు అడుగుల నల్ల మట్టి, ఆ తర్వాత 10 అడుగుల ఇసుక, ఆ తర్వాత మొత్తం నీరే వస్తుందని ఆ ప్రాంతం వారే చెబుతున్నారు.

కానీ నాయకులు ఇందుకు భిన్నంగా మాట్లాడుతున్నారు. పవన్‌ కల్యాణ్ రాజధానిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ గురించి తప్ప అన్నీ మాట్లాడుతున్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ గురించి మాట్లాడకుండా అసలు రాజధాని గురించి చర్చే లేదు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళంతా రైతుల గురించి కాకుండా రియల్ ఎస్టేట్ పడిపోతుందని అని బాధపడుతున్నట్టుగా ఉంది.”

First Published:  31 Aug 2019 12:44 AM GMT
Next Story