Telugu Global
NEWS

ఏపీకి కొత్త ఆర్థిక రాజధాని... తెరపైకి విశాఖ ...

అమరావతి ఏపీకి రాజధానిగా సేఫ్ కాదని ఏపీమంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం నెలకొంది. అయితే అమరావతిని వైఎస్ జగన్ సర్కారు కొనసాగిస్తుందని తాజా సమీక్ష సమావేశంతో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అయితే ఇంకా పురుడుపోసుకుంటున్న అమరావతి కంటే ఆల్ రెడీ అభివృద్ధి చెందిన విశాఖపట్నంను రాజధానిగా చేస్తే మంచిదని కొందరు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏపీకి చివరన ఉండడం.. రాయలసీమకు దూరం కావడంతో విశాఖను రాజధానిగా యాక్సెప్ట్ చేయడం కష్టమేనన్న అభిప్రాయం […]

ఏపీకి కొత్త ఆర్థిక రాజధాని... తెరపైకి విశాఖ ...
X

అమరావతి ఏపీకి రాజధానిగా సేఫ్ కాదని ఏపీమంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలతో రాజకీయ దుమారం నెలకొంది. అయితే అమరావతిని వైఎస్ జగన్ సర్కారు కొనసాగిస్తుందని తాజా సమీక్ష సమావేశంతో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.

అయితే ఇంకా పురుడుపోసుకుంటున్న అమరావతి కంటే ఆల్ రెడీ అభివృద్ధి చెందిన విశాఖపట్నంను రాజధానిగా చేస్తే మంచిదని కొందరు రాజకీయ నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏపీకి చివరన ఉండడం.. రాయలసీమకు దూరం కావడంతో విశాఖను రాజధానిగా యాక్సెప్ట్ చేయడం కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.

అయితే తాజాగా ఏపీకి ఆర్థిక రాజధానిగా విశాఖను చేయాలని మాజీ మంత్రి గంటా ప్రతిపాదనపై కూడా ఏపీ కేబినెట్ మీటింగ్ లో చర్చ జరిగినట్టు సమాచారం. అందుకే బయటకు వచ్చాక ఏపీ అభివృద్ధి విషయంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని.. వికేంద్రీకరణ అవసరాన్ని మంత్రి బొత్స ప్రస్తావించడం విశేషం.

ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా చూస్తే విశాఖపట్నమే అతిపెద్ద నగరం. దీనికి ప్రధాన ఓడరేవు.. నేవి, పెద్ద పారిశ్రామిక సంస్థలు, విమానాశ్రయం, ఐటీ, ఫార్మాహబ్ లు ఉన్నాయి.

దీంతో విశాఖనే ఆర్థిక రాజధానిగా చేస్తే ఏపీ సీఎం జగన్ కు ఓ పెద్ద పని తప్పుతుంది. రాజకీయ రాజధానిగా అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖను చేస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అయితే భౌగోళిక కారణంగానే విశాఖ ఏపీకి రాజధాని కాకుండా పోయింది.

ఏపీకి ఉత్తరాన ఉండడం.. సీమ , దక్షిణ కోస్తాకు దూరంగా ఉండడం రాజధాని అవ్వాల్సిన నగరం ఇప్పుడు ఆర్థిక రాజధానిగా మాత్రమే కావడానికి ఆస్కారం ఏర్పడిందని చెప్పవచ్చు.

First Published:  30 Aug 2019 6:25 AM IST
Next Story