సంక్రాంతి కంటే ముందే పోటీ మొదలు
సాధారణంగా సంక్రాంతికి పోటీ ఉంటుంది. సంక్రాంతి ముందు వరకు బాక్సాఫీస్ డల్ గా సాగుతుంది. ప్రతి ఏటా కనిపించే పరిస్థితి ఇదే. కానీ ఈసారి సంక్రాంతికి అడ్వాన్స్ గా కొన్ని సినిమాలు కర్చీఫ్ వేయడంతో, మిగతా సినిమాలన్నీ ఇతర తేదీల కోసం పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా క్రిస్మస్ సీజన్ పై చాలా సినిమాలు కన్నేశాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 4 సినిమాలు పోటీపడుతున్నాయి. భీష్మ సినిమాను క్రిస్మస్ కే విడుదల చేస్తామని ప్రకటించాడు నితిన్. […]
సాధారణంగా సంక్రాంతికి పోటీ ఉంటుంది. సంక్రాంతి ముందు వరకు బాక్సాఫీస్ డల్ గా సాగుతుంది. ప్రతి ఏటా కనిపించే పరిస్థితి ఇదే. కానీ ఈసారి సంక్రాంతికి అడ్వాన్స్ గా కొన్ని సినిమాలు కర్చీఫ్ వేయడంతో, మిగతా సినిమాలన్నీ ఇతర తేదీల కోసం పోటీపడుతున్నాయి. ఇందులో భాగంగా క్రిస్మస్ సీజన్ పై చాలా సినిమాలు కన్నేశాయి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 4 సినిమాలు పోటీపడుతున్నాయి.
భీష్మ సినిమాను క్రిస్మస్ కే విడుదల చేస్తామని ప్రకటించాడు నితిన్. క్రిస్మస్ రిలీజ్ అంటూ పోస్టర్ కూడా వదిలాడు. అటు రవితేజ కూడా డిస్కోరాజాను డిసెంబర్ 20న థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించాడు. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ చేస్తున్న ప్రతి రోజూ పండగే అనే సినిమాను కూడా క్రిస్మస్ ఆఖరి వారంలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. వీటితో పాటు శర్వానంద్ చేస్తున్న 96 రీమేక్ ను కూడా క్రిస్మస్ సీజన్ కే ఫిక్స్ చేశారు.
ఇలా యంగ్ హీరోస్ సినిమాలన్నీ ఒకేసారి క్రిస్మస్ పై కర్చీఫ్ వేయడంతో సంక్రాంతి కంటే ముందే భారీ పోటీ మొదలైనట్టయింది. ఇలా ఒకేసారి సినిమాలు రాకుండా చూసేందుకు ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులు ప్రయత్నిస్తున్నారు. వాల్మీకి, గ్యాంగ్ లీడర్ మధ్య పోటీలేకుండా చేయగలిగారు. మరి క్రిస్మస్ కు రాబోతున్న ఈ సినిమాల నుంచి ఎన్నింటిని ఒప్పించి పక్కకు జరుపుతారో చూడాలి.