Telugu Global
Cinema & Entertainment

'సాహో' సినిమా రివ్యూ

రివ్యూ : సాహో రేటింగ్ : 2.25/5 తారాగణం : ప్రభాస్, శ్రద్ధ కపూర్, నీల్ నితిన్ ముకేశ్, జాకీ శ్రోఫ్, మందిర బేడీ, వెన్నెల కిషోర్, మురళి శర్మ, తనికెళ్ళ భరణి, మహేష్ మంజ్రేకర్, టిన్ను ఆనంద్, ఎవిలిన్ శర్మ తదితరులు సంగీతం : గురు రాంద్వా, తనిష్క్‌ బగ్చీ, బాద్‌షా నేపథ్య సంగీతం : జిబ్రాన్‌ నిర్మాత : వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, భూషణ్ కుమార్ దర్శకత్వం :  సుజిత్ బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ […]

సాహో సినిమా రివ్యూ
X

రివ్యూ : సాహో
రేటింగ్ : 2.25/5
తారాగణం : ప్రభాస్, శ్రద్ధ కపూర్, నీల్ నితిన్ ముకేశ్, జాకీ శ్రోఫ్, మందిర బేడీ, వెన్నెల కిషోర్, మురళి శర్మ, తనికెళ్ళ భరణి, మహేష్ మంజ్రేకర్, టిన్ను ఆనంద్, ఎవిలిన్ శర్మ తదితరులు
సంగీతం : గురు రాంద్వా, తనిష్క్‌ బగ్చీ, బాద్‌షా
నేపథ్య సంగీతం :
జిబ్రాన్‌
నిర్మాత : వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి, భూషణ్ కుమార్

దర్శకత్వం : సుజిత్

బాహుబలి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో మరొక భారీ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘సాహో’. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మందిరా బేడీ వంటి నటీ నటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించింది. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ‘సాహో’ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే.

ప్రతి అప్డేట్ తోనూ సినిమాపై అంచనాలను భారీగా పెంచుతూ వచ్చారు చిత్ర దర్శక నిర్మాతలు. భారీ అంచనాల మధ్య ‘సాహో’ సినిమా ఎట్టకేలకు ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

గ్యాంగ్‌స్టర్స్‌ రాజ్యమేలే వాజీ సిటీలో ‘సాహో’ కథ మొదలవుతుంది. పృథ్వీ రాజ్‌ (టిను ఆనంద్‌) తన అండర్‌ వరల్డ్‌ సామ్రాజ్యానికి తన కొడుకు దేవరాజ్‌ (చుంకీ పాండే)ను వారసుడిని చేయాలనుకుంటాడు. కానీ రాయ్‌ (జాకీ ష్రాఫ్) రాయ్‌ గ్రూప్‌ పేరుతో మరొక క్రైమ్‌ సిండికేట్‌ను నడిపిస్తుంటాడు. దీంతో రాయ్‌ మీద దేవరాజ్‌ ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాడు.

ఒకరోజు రాయ్‌ ముంబయి లో అనుమానాస్పదంగా రోడ్డు ప్రమాదంలో చనిపోతాడు. మరోవైపు ముంబయిలో రూ. రెండు లక్షల కోట్లతో వస్తున్న ఒక షిప్‌ పేలిపోతుంది. అప్పుడే రాయ్‌ కొడుకు విశ్వక్‌ (అరుణ్‌ విజయ్‌) గ్యాంగ్‌స్టర్‌ సామ్రాజ్యంలోకి వారసుడిగా మారతాడు.

ఆ షిప్ ప్రమాదంలో పోయిన రెండు లక్షల కోట్లను రెండు వారాల్లో తీసుకొస్తానని సవాలు చేస్తాడు. అదే కేస్ ని సాల్వ్ చేయడానికి అండర్‌ కవర్‌ కాప్‌ అశోక్‌ చక్రవర్తి (ప్రభాస్‌) రంగంలోకి దిగుతాడు. అమృతా నాయర్‌ (శ్రద్ధ కపూర్‌)తో కలిసి ఈ కేసును విచారిస్తుంటాడు. అసలు రాయ్‌ని ఎవరు చంపారు? రూ.రెండు లక్షల కోట్లు ఏమయ్యాయి? అసలు సాహో ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్రభాస్ అద్భుతమైన నటన ఈ సినిమాకి వెన్నెముక గా చెప్పుకోవచ్చు. ప్రభాస్ ఈ సినిమా కోసం పడిన కష్టం ప్రతి ఫ్రేమ్ లోనూ ప్రేక్షకులకు కనిపిస్తుంది. తన డైలాగ్ డెలివరీ లోను, ఎక్స్ ప్రెషన్స్ లోనూ, డాన్స్ లోనూ ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను ప్రభాస్ నటన నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది. ‘బాహుబలి’ తర్వాత మళ్లీ ఒక కష్టమైన పాత్ర పోషించిన ప్రభాస్… తన పాత్రకి పూర్తి స్థాయిలో న్యాయం చేశాడు.

శ్రద్ధ కపూర్ నటన ఈ సినిమాకి మరింత బలం చేకూర్చింది. కేవలం తన అందంతో మాత్రమే కాకుండా యాక్షన్ సన్నివేశాలలో సైతం తన సత్తా చాటుతూ శ్రద్ధ కపూర్ నటన అందరినీ మెప్పిస్తుంది.

నీల్ నితిన్ ముకేశ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి చాలా బాగా హెల్ప్ అయింది. ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేస్తూ నీల్ నితిన్ స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జాకీ ష్రాఫ్ మరియు మందిరా బేడీ ల పాత్రలు తక్కువ సేపే కనిపించినప్పటికీ అవి ఖచ్చితంగా ప్రేక్షకుల పై ప్రభావం చూపిస్తాయి.

మురళి శర్మ నటన ఈ సినిమాకి మరింత బలం చేకూర్చింది. వెన్నెల కిషోర్ సినిమాలో చాలా బాగా నటించాడు. టిన్ను ఆనంద్ మరియు మహేష్ మంజ్రేకర్…. మిగతా నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

దర్శకుడు సుజిత్…. గతంలో ఒకే ఒక్క సినిమాకి దర్శకత్వం వహించాడు. మరి అలాంటిది తనపై ‘సాహో’ వంటి పెద్ద సినిమా అంటే ఎలా ఉంటుందో అని కొందరు అభిమానులు ముందు కొంచెం భయపడ్డారు. కానీ టీజర్ మరియు ట్రైలర్ చూసినప్పుడు వారికి కొంత నమ్మకం కలిగింది.

అయితే సాహో చూశాక ఎలాంటి సినిమానైనా సుజిత్ అద్భుతంగా తీర్చిదిద్దగలడు అనే పూర్తి నమ్మకం సినిమా చూసిన వారికి కలుగుతుంది. దర్శకుడు ఈ సినిమాని మలచిన విధానం అందరు ప్రేక్షకులని ఆకర్షిస్తుంది. సినిమా మొదలైన దగ్గర నుంచి పూర్తయ్యేవరకు తన నెరేషన్ తో సుజిత్ ప్రేక్షకులను కట్టి పడేసాడు.

యూవీ క్రియేషన్స్, టి సిరీస్ అందించిన మంచి నిర్మాణ విలువలు ఈ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ప్రతి సన్నివేశంలోనూ వారు పెట్టిన బడ్జెట్ చాలా బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా జిబ్రాన్ అందించిన నేపథ్య సంగీతం కూడా సినిమాకి మరో హైలైట్ గా చెప్పుకోవచ్చు.

సినిమాటోగ్రఫర్ ఆర్. మధి అందించిన విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి సన్నివేశాన్ని మధి చాలా బాగా గ్రాండ్ గా చూపించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా బాగుంది.

బలాలు:

ప్రభాస్, విజువల్స్, నేపధ్య సంగీతం, ఇంటర్వెల్ సీన్

బలహీనతలు:

స్లో స్క్రీన్ ప్లే, రొటీన్ కథ

చివరి మాట:

ఈ సినిమాకి ప్రాణం యాక్షన్‌ సీన్లు, సినిమాలో వచ్చే ట్విస్టులు. అయితే ఈ సినిమాలో కావల్సినన్ని కమర్షియల్ అంశాలు కూడా చాలానే ఉన్నాయి. హాలీవుడ్‌ గ్యాంగ్‌స్టర్ సినిమాలకు ‘సాహో’ సినిమా ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు సుజిత్‌ సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు.

ముఖ్యంగా ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ సీన్లలో మనం చూసేది తెలుగు సినిమానా లేక హాలీవుడ్ సినిమానా అనే అనుమానం కలుగక మానదు. మొదటి సన్నివేశం నుంచి ఆఖరి వరకు అద్భుతమైన విజువల్స్, కట్టిపడేసే ఛేజింగ్ సన్నివేశాలు సినిమా మొత్తం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

ఇక డైలాగ్‌లు సినిమా కి ప్రాణం పోశాయి. సినిమా ఆఖరులో ప్రభాస్‌ పాత్రలో వచ్చే వేరియేషన్స్ సినిమాని మరింత ఆసక్తికరంగా మార్చాయి. సినిమాలో ప్రభాస్‌ వన్‌మ్యాన్‌ షో చేసాడు అని చెప్పవచ్చు.

అయితే రొటీన్ కథ, మరియు అక్కడక్కడా బోరింగ్ స్క్రీన్ ప్లే మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరిక్షించాయి. చివరగా ‘సాహో’ సినిమా ప్రేక్షకులను ఒక కొత్త లోకం లోకి తీసుకువెళ్లి మర్చిపోలేని అనుభవాన్ని అందిస్తుంది.

బాటమ్ లైన్: కేవలం విజువల్ ఎఫెక్ట్స్ బేస్ గా సాగే సినిమా

First Published:  30 Aug 2019 3:01 PM IST
Next Story