మోడీ సర్కార్‌కు భారీ షాక్... భారీగా పడిపోయిన జీడీపీ
ఆర్థిక మాంద్యం దేశంపై గట్టి ప్రభావమే చూపుతోంది. ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలే దేశ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. బ్యాంకుల విలీనాన్ని ప్రకటించిన కాసేపటికే దేశ జీడీపీని కూడా ప్రకటించారు. జీడీపీ లెక్కలు షాక్‌కు గురి చేస్తున్నాయి. జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. గతేడాది జీడీపీ 8 శాతం ఉండగా అది ఇప్పుడు 5శాతానికి పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మాసంలో ఇది 5.8 శాతంగా ఉంది. జీడీపీ […]
ఆర్థిక మాంద్యం దేశంపై గట్టి ప్రభావమే చూపుతోంది. ప్రభుత్వం వెల్లడిస్తున్న గణాంకాలే దేశ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నాయి. బ్యాంకుల విలీనాన్ని ప్రకటించిన కాసేపటికే దేశ జీడీపీని కూడా ప్రకటించారు.
జీడీపీ లెక్కలు షాక్‌కు గురి చేస్తున్నాయి. జీడీపీ వృద్ధి రేటు 5 శాతానికి పడిపోయింది. ఇది ఆరేళ్ల కనిష్ట స్థాయి. గతేడాది జీడీపీ 8 శాతం ఉండగా అది ఇప్పుడు 5శాతానికి పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మాసంలో ఇది 5.8 శాతంగా ఉంది. జీడీపీ తక్కువగానే ఉంటుందని ముందే ఊహించారు. అయితే అది 5.5 వరకు ఉండవచ్చనుకున్నారు. కానీ ఇలా ఏకంగా 5 శాతానికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
తయారీ రంగం గ్రోత్ దారుణంగా పడిపోయి 0.06 శాతంగా ఉంది. దేశంలో కొనుగోళ్లు, అమ్మకాలు భారీగా పడిపోయాయి. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే ఉద్దీపన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో వాటి ప్రభావం ఎలా ఉంటుంది అన్నది వచ్చే త్రైమాసికంలో తెలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
జీడీపీ వృద్ధిరేటు మరీ ఇంత దారుణంగా పడిపోవడం వల్ల పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంటుందని… ఆ పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు ఆర్థిక నిపుణులు.