మేం అడుక్కునే వాళ్లం కాదు... గులాబీ జెండా ఓనర్లం...
తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆలోచనకు సంబంధించిన సమాచారాన్ని ఉద్యోగ సంఘాల వద్ద ఈటల లీక్ చేశారని.. దాంతో ఆయన్ను కేబినెట్ నుంచి తొలగిస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి చాలా ఘాటుగా ఉండడంతో చర్చనీయాంశమైంది. తనకు మంత్రి పదవి ఎవరో పెట్టిన భిక్ష కాదన్నారు. బీసీ కోటాలో మంత్రి పదవి తాను తీసుకోలేదని… బీసీ కోటాలో మంత్రి పదవి కావాలంటూ తానెప్పుడూ అడగలేదన్నారు. తాము […]

తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఆలోచనకు సంబంధించిన సమాచారాన్ని ఉద్యోగ సంఘాల వద్ద ఈటల లీక్ చేశారని.. దాంతో ఆయన్ను కేబినెట్ నుంచి తొలగిస్తారంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి చాలా ఘాటుగా ఉండడంతో చర్చనీయాంశమైంది.
తనకు మంత్రి పదవి ఎవరో పెట్టిన భిక్ష కాదన్నారు. బీసీ కోటాలో మంత్రి పదవి తాను తీసుకోలేదని… బీసీ కోటాలో మంత్రి పదవి కావాలంటూ తానెప్పుడూ అడగలేదన్నారు.
తాము అడుక్కునే వాళ్లం కాదని… అడుక్కునే వారు ఎవరో త్వరలోనే తేలుతుందన్నారు. తాను టీఆర్‌ఎస్‌లోకి మధ్యలో వచ్చిన వ్యక్తిని కాదన్నారు. గులాబీ జెండాకు తాము ఓనర్లమని చెప్పారు.
అధికారం శాశ్వతం కాదని… ధర్మం, న్యాయమే శాశ్వతమన్నారు. 15 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నడూ ఒక్కసారి కూడా లంచం తీసుకోలేదన్నారు. అలా తీసుకున్నట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. సొంతంగా ఎదగలేని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రజలే చరిత్ర నిర్మాతలని… వ్యక్తులు కాదని ఈటెల వ్యాఖ్యానించారు. ఎవరు హీరో… ఎవరు జీరో అన్నది త్వరలోనే తేలిపోతుందన్నారు. తానెప్పుడూ వెలిగే దీపాన్నే అని వ్యాఖ్యానించారు. హుజూరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించిన ఈటల ఉద్వేగానికి లోనయ్యారు.