Telugu Global
NEWS

రిటైర్మెంట్ వీడిన అంబటి రాయుడు

సీనియర్ల సలహాతో మనసు మార్చుకొన్న అంబటి మూడుఫార్మాట్లలోనూ అందుబాటులో రాయుడు హైదరాబాద్ డాషింగ్ క్రికెటర్ అంబటి రాయుడు మనసు మార్చుకొన్నాడు. రిటైర్మెంట్ వీడి…క్రికెట్ మూడుఫార్మాట్లకు తాను అందుబాటులో ఉన్నట్లు ప్రకటించాడు. ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోడంతో తీవ్రమనస్తాపంతో రిటైర్మెంట్ ప్రకటించిన 58 రోజుల్లోనే రాయుడు తన నిర్ణయం మార్చుకొన్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘానికి, బీసీసీఐకి తెలిపాడు. భావోద్వేగంలో తాను తీసుకొన్న రిటైర్మెంట్ నిర్ణయాన్నిఉపసంహరించుకొంటున్నట్లు తన లేఖలో తెలిపాడు. సీనియర్ల సలహా పైనే…. హైదరాబాద్ […]

రిటైర్మెంట్ వీడిన అంబటి రాయుడు
X
  • సీనియర్ల సలహాతో మనసు మార్చుకొన్న అంబటి
  • మూడుఫార్మాట్లలోనూ అందుబాటులో రాయుడు

హైదరాబాద్ డాషింగ్ క్రికెటర్ అంబటి రాయుడు మనసు మార్చుకొన్నాడు. రిటైర్మెంట్ వీడి…క్రికెట్ మూడుఫార్మాట్లకు తాను అందుబాటులో ఉన్నట్లు ప్రకటించాడు.

ఇంగ్లండ్ వేదికగా ముగిసిన వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకపోడంతో తీవ్రమనస్తాపంతో రిటైర్మెంట్ ప్రకటించిన 58 రోజుల్లోనే రాయుడు తన నిర్ణయం మార్చుకొన్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘానికి, బీసీసీఐకి తెలిపాడు.

భావోద్వేగంలో తాను తీసుకొన్న రిటైర్మెంట్ నిర్ణయాన్నిఉపసంహరించుకొంటున్నట్లు తన లేఖలో తెలిపాడు.

సీనియర్ల సలహా పైనే….

హైదరాబాద్ క్రికెట్ దిగ్గజాలు వీవీఎస్ లక్ష్మణ్, నోయిల్ డేవిడ్ లాంటి పలువురు సీనియర్లు, చెన్నై ఫ్రాంచైజీ ప్రముఖుల సలహాలు, సూచనలపైనే రాయుడు తన నిర్ణయం మార్చుకొన్నట్లు వివరించాడు.

అంతర్జాతీయ స్థాయిలో భారత, హైదరాబాద్ క్రికెట్ కు సేవలు అందించే సత్తా తనలో ఇంకా మిగిలే ఉందని రాయుడు పేర్కొన్నాడు.

కష్టసమయంలో తనకు అండగా నిలిచిన సీనియర్ క్రికెటర్లకు కృతజ్ఞతలు తెలిపాడు.

హైదరాబాద్ జట్టులో రాయుడు…

ప్రస్తుత సీజన్ నుంచి రంజీ ట్రోఫీతో సహా మొత్తం మూడుఫార్మాట్లలోనూ హైదరాబాద్ జట్టుకు రాయుడు అందుబాటులో ఉంటాడని సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ నోయెల్ డేవిడ్ ప్రకటించారు.

రాయుడుతో సవివరంగా చర్చించడమే కాదు…కౌన్సెలింగ్ ఇచ్చి రిటైర్మెంట్ పై నిర్ణయం మార్చుకొనేలా చేశామని… హైదరాబాద్ క్రికెట్ కు రాయుడి అవసరం ఎంతో ఉందని, 2019-2020 క్రికెట్ సీజన్లో భారతజట్టు సెలెక్షన్ కు సైతం రాయుడు అందుబాటులో ఉంటాడని నోయల్ డేవిడ్ వివరణ ఇచ్చారు.

33 ఏళ్ల అంబటి రాయుడికి గత 19 సంవత్సరాల కాలంలో 55 వన్డేలు, 6 టీ-20 మ్యాచ్ లతో పాటు…470కి పైగా ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన అనుభవం ఉంది.

జూనియర్ ప్రపంచకప్ లో భారత జట్టుకు నాయకత్వం వహించడంతో పాటు..రన్నరప్ గా నిలిపిన ఘనత సైతం రాయుడికి సొంతం.

ఐపీఎల్ లో గతంలో ముంబై, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఆడుతున్న సంగతి తెలిసిందే

First Published:  30 Aug 2019 1:50 AM IST
Next Story