జూపల్లి, శ్రీనివాసన్‌కు జగన్ గ్రీన్ సిగ్నల్
టీటీడీ బోర్డు సభ్యుల ఎంపికపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. పలువురి పేర్లను దాదాపు ఓకే చేశారు. ఇప్పటి వరకు 18 మందితో బోర్డు ఉండగా… ఆ సంఖ్యను 25కు పెంచారు. తమిళనాడు కోటాలో ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్ శ్రీనివాసన్ పేరు దాదాపు ఖాయమైంది. కర్నాటక కోటాలో కృపేందర్, సుందర్ పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ కోటాలో జూపల్లి రామేశ్వరరావు పేరును జగన్ ఖాయం చేశారు. తెలంగాణ నుంచి వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి […]
టీటీడీ బోర్డు సభ్యుల ఎంపికపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. పలువురి పేర్లను దాదాపు ఓకే చేశారు. ఇప్పటి వరకు 18 మందితో బోర్డు ఉండగా… ఆ సంఖ్యను 25కు పెంచారు. తమిళనాడు కోటాలో ఇండియా సిమెంట్స్ అధినేత ఎన్ శ్రీనివాసన్ పేరు దాదాపు ఖాయమైంది.
కర్నాటక కోటాలో కృపేందర్, సుందర్ పేర్లు వినిపిస్తున్నాయి. తెలంగాణ కోటాలో జూపల్లి రామేశ్వరరావు పేరును జగన్ ఖాయం చేశారు. తెలంగాణ నుంచి వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. ఏపీ నుంచి యలమంచిలి ఎమ్మెల్యే రమణమూర్తి, కాకినాడ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, ఎస్సీ కోటా నుంచి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే కోటాలో భూమన కరుణాకర్ రెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మహిళా కోటాలో రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి పేరు దాదాపు ఖాయమయ్యాయి.
25 మందికి సభ్యులుగా అవకాశం ఇస్తున్న నేపథ్యంలో అన్ని వర్గాల వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని చెబుతున్నారు. కొద్దిరోజుల్లో జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు.