Telugu Global
NEWS

కోడెల చర్య స్పీకర్ స్థానానికే మాయని మచ్చ

ఆంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన పని శాసనసభలో అత్యున్నతమైన స్పీకర్ స్థానానికి మాయని మచ్చ తీసుకు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. “శాసనసభ ఫర్నీచర్ ను, కంప్యూటర్లను, ఇతర సామాగ్రిని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయన ఇంటికి తరలించి సొంతంగా వాడుకోవడం అత్యంత హేయమైన చర్య. ఈ పని చేసి స్పీకర్ స్థానానికి తలవంపులు తెచ్చారు కోడెల శివప్రసాదరావు” అని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన […]

కోడెల చర్య స్పీకర్ స్థానానికే మాయని మచ్చ
X

ఆంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన పని శాసనసభలో అత్యున్నతమైన స్పీకర్ స్థానానికి మాయని మచ్చ తీసుకు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.

“శాసనసభ ఫర్నీచర్ ను, కంప్యూటర్లను, ఇతర సామాగ్రిని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆయన ఇంటికి తరలించి సొంతంగా వాడుకోవడం అత్యంత హేయమైన చర్య. ఈ పని చేసి స్పీకర్ స్థానానికి తలవంపులు తెచ్చారు కోడెల శివప్రసాదరావు” అని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం నాడు ఢిల్లీలో జరగనున్న వివిధ రాష్ట్రాల శాసనసభ స్పీకర్ల సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన తమ్మినేని సీతారాం విలేకరులతో మాట్లాడుతూ… కోడెల శివప్రసాద్ రావు చేసిన చర్య వ్యక్తిగతంగా కాదు స్పీకర్ వ్యవస్థకే మచ్చ తెచ్చింది అని అన్నారు.

ప్రజా ప్రతినిధులు పార్టీ మారాలని కోరుకోవడం తప్పుకాదని, అయితే వారు ఏ పార్టీ నుంచి విజయం సాధించారో ఆ పార్టీ ద్వారా వచ్చిన శాసన సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాతే పార్టీ మారాలని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.

గురువారం నాడు ఢిల్లీలో జరగనున్న శాసనసభ సభాపతుల సమావేశంలో ఇదే విషయాన్ని తాను ప్రస్తావిస్తామని, ఈ అంశంపై చట్టం కూడా తీసుకురావాలని తాను సూచిస్తానని చెప్పారు.

ప్రజా ప్రతినిధులు ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు పార్టీ మారిపోతే ఆయా పార్టీల మీద కాదు… ప్రజాస్వామ్యం మీదే ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.

రాజధాని అమరావతి అంశంపై స్పందించిన తమ్మినేని సీతారాం… మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలను సమర్థించారు.

“రాజధాని అమరావతిపై శివరామకృష్ణన్ చెప్పిన అంశాలనే మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చెప్పారు. ఇందులో తప్పేముంది” అని స్పీకర్ వ్యాఖ్యానించారు.

శాసనసభలో… అధికార, ప్రతిపక్ష సభ్యుల అందరి అభిప్రాయాలను తీసుకుని సభ సజావుగా నడిపేందుకు కృషి చేస్తానని తమ్మినేని అన్నారు.

First Published:  29 Aug 2019 6:32 AM IST
Next Story