జగన్ మౌనం.. హడలి చస్తున్న టీడీపీ
అమరావతి ఏపీకి రాజధానిగా ఉంటుందా.? ఉండదా.? ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతికి వరద ముప్పు ఉందని… సమీక్షిస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారు. ఇక విజయసాయిరెడ్డి లాంటి వైసీపీ కీలక నేత టీడీపీ వాళ్లు అమరావతిలో భారీగా భూములు కొన్నారని.. అందుకే ఇలా రాజధానిపై గగ్గోలు పెడుతున్నారని విమర్శిస్తున్నారు. అయితే రాజధానిపై ఎవ్వరు ఏం మాట్లాడినా… ఏపీ సీఎం జగన్ మాత్రం ఇప్పటివరకు ఏపీ రాజధాని విషయంలో స్పందించకపోవడం.. మౌనంగా ఉండడంతో టీడీపీ నేతలు హడలి చస్తున్నారు. అమరావతి […]
అమరావతి ఏపీకి రాజధానిగా ఉంటుందా.? ఉండదా.? ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతికి వరద ముప్పు ఉందని… సమీక్షిస్తున్నామంటూ వ్యాఖ్యలు చేశారు.
ఇక విజయసాయిరెడ్డి లాంటి వైసీపీ కీలక నేత టీడీపీ వాళ్లు అమరావతిలో భారీగా భూములు కొన్నారని.. అందుకే ఇలా రాజధానిపై గగ్గోలు పెడుతున్నారని విమర్శిస్తున్నారు.
అయితే రాజధానిపై ఎవ్వరు ఏం మాట్లాడినా… ఏపీ సీఎం జగన్ మాత్రం ఇప్పటివరకు ఏపీ రాజధాని విషయంలో స్పందించకపోవడం.. మౌనంగా ఉండడంతో టీడీపీ నేతలు హడలి చస్తున్నారు.
అమరావతి రాజధాని అవుతుందని ముందే తెలుసుకున్న టీడీపీ మాజీ నేత సుజనచౌదరి, మాజీ మంత్రి , టీడీపీ నేత నారాయణ వంటి వాళ్లు పెద్ద ఎత్తున అక్కడ భూములు కొని లాభపడ్డారన్నది వైసీపీ విమర్శ. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కనుక అక్కడ రాజధానిని ఎత్తివేస్తే నిండా మునిగేది వీళ్లే. పైగా వీరు టీడీపీ బ్యాక్ బోన్ లాంటి వాళ్లు. అందుకే రాజధాని తరలించవద్దని రచ్చ చేస్తున్నారు.
అయితే ఇంత రాద్ధాంతం జరుగుతున్నా ఏపీ సీఎం హోదాలో ఉన్న జగన్ మాత్రం దీనిపై మౌనం వహించడం టీడీపీని కలవరపెడుతోంది.
తాజాగా అమరావతిపై జగన్ మౌనం ప్రమాదకరమని టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలుచేశారు. జగన్ ఇప్పటికైనా రాజధానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాదు.. విశాఖను ఏపీకి ఆర్థిక రాజధాని చేయాలని కొత్త డిమాండ్ ను గంటా బయటపెట్టారు.