కోడెల మనసు క్షోభించిందట....
ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్, కంప్యూటర్స్ తదితర వస్తువులను చోరీ చేసి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పెద్ద సంచలనమే సృష్టించిన విషయం తెలిసిందే. కోడెల చేసిన పని… స్పీకర్ స్థానానికి మాయని మచ్చ అని సీనియర్ రాజకీయనాయకులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా… కోడెల ఏమాత్రం సిగ్గుపడుతున్నట్లుగా అనిపించడం లేదు. ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కోడెల ఒక లేఖను విడుదల చేశాడు. అసెంబ్లీకి సంబంధించిన ఏదైనా ఫర్నీచర్ ఇంకా నా కార్యాలయంలో ఉంటే తీసుకెళ్ళండి అంటూ లేఖలో పేర్కొన్నారు. […]
ఏపీ అసెంబ్లీ ఫర్నీచర్, కంప్యూటర్స్ తదితర వస్తువులను చోరీ చేసి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పెద్ద సంచలనమే సృష్టించిన విషయం తెలిసిందే.
కోడెల చేసిన పని… స్పీకర్ స్థానానికి మాయని మచ్చ అని సీనియర్ రాజకీయనాయకులు, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నా… కోడెల ఏమాత్రం సిగ్గుపడుతున్నట్లుగా అనిపించడం లేదు.
ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ కోడెల ఒక లేఖను విడుదల చేశాడు. అసెంబ్లీకి సంబంధించిన ఏదైనా ఫర్నీచర్ ఇంకా నా కార్యాలయంలో ఉంటే తీసుకెళ్ళండి అంటూ లేఖలో పేర్కొన్నారు.
ఇక నుంచి ఈ విషయంలో తనను క్షోభ పెట్టొద్దన్నారు. నిబద్దతతో 37 ఏళ్ళుగా రాజకీయాలు చేశానని…. ఫర్నీచర్ విషయంలో తన తప్పేంలేదన్నారు కోడెల.
పొరపాటున నా ఇంట్లో తెచ్చిపెట్టారని…. పదవీ కాలం పూర్తవగానే ఫర్నీచర్ తీసుకెళ్ళమని చెప్పానని, లేకపోతే ఫర్నీచర్ కు డబ్బు చెల్లిస్తానంటూ అసెంబ్లీ కార్యదర్శికి జూన్ 7న , ఆగస్టు 20న మరో లేఖను రాశానని.. ఆ లేఖలకు స్పందించకపోవడంతో…. స్పీకర్ కు కూడా లేఖ రాశానన్నారు కోడెల.
హైదరాబాద్ నుంచి అమరావతికి ఫర్నీచర్‌ను తీసుకొచ్చే క్రమంలో…. అధికారులు తన క్యాంప్ కార్యాలయంలో కొంత ఫర్నీచర్ తెచ్చిపెట్టారన్నారు కోడెల.
అయితే అసెంబ్లీ ఫర్నీచర్ కోడెల కుమారుడి షో రూమ్ లో ఎందుకు ఉందో మాత్రం లేఖలో చెప్పలేదు కోడెల.
ఇలా ఫర్నీచర్ విషయంలో ఇకనుంచి తనను క్షోభ పెట్టొద్దంటూ ప్రభుత్వాన్ని వేడుకున్నారు మాజీ స్పీకర్ కోడెల.