Telugu Global
NEWS

ట్రాఫింగ్ ఉల్లంఘనలపై.... ఏపీ సర్కారు ఉక్కుపాదం

ఇప్పటికే డ్రంకెన్ డ్రైవ్ కు 10వేల రూపాయల ఫైన్…. హెల్మెట్, రాష్ డ్రైవింగ్ సహా ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ ఫైన్ విధిస్తున్న కేంద్రం కొత్త నిబంధన వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. తాజాగా ఏపీ సర్కారు కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొత్త రూల్ వినియోగదారులకు షాకింగ్ లా మారింది. ఇది అమలైతే ఇక అందరూ ట్రాఫిక్ పోలీసులే అయిపోతారన్న చర్చ సాగుతోంది. ట్రాఫిక్ ఉల్లంఘనలతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఏపీ సర్కారు తాజాగా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. […]

ట్రాఫింగ్ ఉల్లంఘనలపై.... ఏపీ సర్కారు ఉక్కుపాదం
X

ఇప్పటికే డ్రంకెన్ డ్రైవ్ కు 10వేల రూపాయల ఫైన్…. హెల్మెట్, రాష్ డ్రైవింగ్ సహా ట్రాఫిక్ ఉల్లంఘనలపై భారీ ఫైన్ విధిస్తున్న కేంద్రం కొత్త నిబంధన వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. తాజాగా ఏపీ సర్కారు కూడా ట్రాఫిక్ ఉల్లంఘనలపై కొత్త రూల్ వినియోగదారులకు షాకింగ్ లా మారింది. ఇది అమలైతే ఇక అందరూ ట్రాఫిక్ పోలీసులే అయిపోతారన్న చర్చ సాగుతోంది.

ట్రాఫిక్ ఉల్లంఘనలతో పాటు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఏపీ సర్కారు తాజాగా కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తున్నట్లు కనిపిస్తే వెంటనే ఫొటో తీసి ఏపీ రవాణా శాఖకు పంపేలా ఏర్పాట్లు చేసింది.

స్మార్ట్ ఫోన్ యూజర్లు అందరూ వాడుతున్న వాట్సాప్ నే ఇందుకోసం ఏపీ రవాణా శాఖ ఆయుధంగా మార్చేసింది. తాజాగా రవాణా శాఖ ప్రత్యేక వాట్సాప్ నంబర్ 9542800800 ను కేటాయించింది. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి.

ఎవరైనా సరే ట్రాఫిక్ ఎక్కడ ఉల్లంఘించినా సరే ఒక్క ఫొటో తీసి ఈ వాట్సాప్ నంబర్ కు పంపిస్తే చాలు రవాణా శాఖ వెంటనే చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్నినాని ప్రకటించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించే వారికి ప్రజలే ప్రత్యేక ట్రాఫిక్ పోలీసులుగా మారి వాట్సాప్ తో వారికి జరిమానా విధించవచ్చని మంత్రి తెలిపారు.

First Published:  29 Aug 2019 1:05 AM GMT
Next Story