టెస్ట్ ర్యాంకింగ్స్ టాప్ -10లో బుమ్రా
నంబర్ వన్ ర్యాంక్ నిలుపుకొన్న కొహ్లీ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా విండీస్ తో ముగిసిన తొలిటెస్ట్ అనంతరం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకొన్నాడు. మరోవైపు బౌలింగ్ విభాగంలో భారత స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా తొలిసారిగా టాప్ టెన్ ర్యాంకింగ్స్ లో చోటు సంపాదించాడు. నంబర్ వన్ విరాట్ కొహ్లీ…. బ్యాట్స్ […]
- నంబర్ వన్ ర్యాంక్ నిలుపుకొన్న కొహ్లీ
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్ల జోరు కొనసాగుతోంది. రెండుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా విండీస్ తో ముగిసిన తొలిటెస్ట్ అనంతరం ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ బ్యాటింగ్ విభాగంలో భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకొన్నాడు.
మరోవైపు బౌలింగ్ విభాగంలో భారత స్టార్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా తొలిసారిగా టాప్ టెన్ ర్యాంకింగ్స్ లో చోటు సంపాదించాడు.
నంబర్ వన్ విరాట్ కొహ్లీ….
బ్యాట్స్ మన్ ర్యాంకింగ్స్ మొదటి రెండుస్థానాలలో భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, ఆస్ట్ర్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కొనసాగుతున్నారు. కొహ్లీ మొత్తం 910 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిస్తే…స్టీవ్ స్మిత్ 904 పాయింట్లతో రెండోర్యాంకర్ గా ఉన్నాడు. కొహ్లీకి స్మిత్ కేవలం 6 పాయింట్ల దూరంలో మాత్రమే ఉన్నాడు.
ఆంటీగా టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 81, రెండో ఇన్నింగ్స్ లో 102 పరుగులు సాధించడం ద్వారా భారత వైస్ కెప్టెన్ అజింక్యా రహానే పదిస్థానాలు మెరుగుపరచుకొని.. ఏకంగా 11వ ర్యాంక్ లో నిలిచాడు.
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ బ్యాటింగ్ విభాగంలో 13, ఆల్ రౌండర్ విభాగంలో రెండు ర్యాంక్ లు సాధించాడు.
బుమ్రా బూమ్ బూమ్…
భారత యువఫాస్ట్ బౌలర్ జస్ ప్రీత్ బుమ్రా …తొలిసారిగా టెస్ట్ ర్యాంకింగ్స్ టాప్ టెన్ లో చోటు సంపాదించాడు. విండీస్ తో ముగిసిన తొలిటెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లు సాధించడం ద్వారా బుమ్రా.. తన ర్యాంక్ ను 9 స్థానాల మేర మెరుగుపరచుకొని… 7వ ర్యాంక్ లో నిలిచాడు.
టెస్ట్ క్రికెట్లో అత్యంత వేగంగా 50 వికెట్లు పడగొట్టిన భారత తొలిబౌలర్ గా నిలిచిన బుమ్రా…తన కెరియర్ లో ఇప్పటి వరకూ ఆడిన 11 టెస్టుల్లోనే 55 వికెట్లు పడగొట్టడం విశేషం.