Telugu Global
National

సుజనా 'చంద్ర' భక్తి పై బీజేపీ దృష్టి

సుజనా చౌదరి బీజేపీలో చేరినా ఆయన మనసు మాత్రం ఇంకా చంద్రబాబు చుట్టే తిరుగుతోందని వైసీపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. తాజాగా రాజధాని తరలింపుపై రచ్చ చేస్తున్న సుజనా చౌదరిని…. నువ్వు బీజేపీలో ఉండి ఇలా చంద్రబాబుకు మద్దతుగా రాజకీయం చేస్తావా అంటూ విజయసాయిరెడ్డి కడిగి పారేశారు. విజయసాయిరెడ్డి తాజాగా ట్విట్టర్ సాక్షిగా సుజన తీరును ఎండగట్టారు. మీ రాజకీయ జీవితమంతా చౌకబారు విన్యాసాలే అంటూ సుజనపై ఫైర్ […]

సుజనా చంద్ర భక్తి పై బీజేపీ దృష్టి
X

సుజనా చౌదరి బీజేపీలో చేరినా ఆయన మనసు మాత్రం ఇంకా చంద్రబాబు చుట్టే తిరుగుతోందని వైసీపీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

తాజాగా రాజధాని తరలింపుపై రచ్చ చేస్తున్న సుజనా చౌదరిని…. నువ్వు బీజేపీలో ఉండి ఇలా చంద్రబాబుకు మద్దతుగా రాజకీయం చేస్తావా అంటూ విజయసాయిరెడ్డి కడిగి పారేశారు.

విజయసాయిరెడ్డి తాజాగా ట్విట్టర్ సాక్షిగా సుజన తీరును ఎండగట్టారు. మీ రాజకీయ జీవితమంతా చౌకబారు విన్యాసాలే అంటూ సుజనపై ఫైర్ అయ్యారు.

రెండు సార్లు రాజ్యసభ ఎంపీ అయ్యి.. కేంద్రమంత్రిని కూడా చేసిన చంద్రబాబుకు లోపాయికారిగా బీజేపీలో ఉంటూ సుజనా పనిచేస్తున్నాడంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు సుజన ఎంత కప్పం కట్టారో అందరికీ తెలుసు అంటూ ఎద్దేవా చేశారు.

సుజనా బీజేపీలో చేరినా మీ హృదయం నిండా ఇంకా చంద్రబాబే ఉన్నారని తాజా పరిణామాలతో స్పష్టమైందని సుజనా చౌదరిపై విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు శుద్ధపూసలా మాట్లాడుతుంటే జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

చంద్రబాబుకు కోవర్టుగా బీజేపీలో చేరారని.. మీ ప్రతిచర్యను బీజేపీ అధిష్టానం గమనిస్తుందని.. ఎప్పుడో ఒకప్పుడు చర్యలు తప్పవంటూ సుజనాను హెచ్చరించారు విజయసాయిరెడ్డి.

రెండు మూడు రోజులుగా చంద్రబాబుకు సపోర్టుగా మాట్లాడుతున్న సుజనాను బీజేపీ అధిష్టానం కూడా కనిపెడుతోందంటూ జలక్ ఇచ్చారు. బీజేపీలో చేరినా బాబును సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్న సుజనా తీరు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

విజయసాయిరెడ్డి ట్వీట్స్ ఇవే..

First Published:  28 Aug 2019 6:10 AM IST
Next Story