Telugu Global
NEWS

తెలుగుతేజం సాయి ప్రణీత్ కు అరుదైన ఘనత

1983లో ప్రకాశ్…2019లో సాయి ప్రణీత్ 36 ఏళ్ల తర్వాత భారత్ కు ప్రపంచ పతకం తెచ్చిన ప్రణీత్ స్విట్జర్లాండ్ లోని బాసెల్ వేదికగా ముగిసిన 2019 ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో తెలుగుతేజం సాయి ప్రణీత్ అరుదైన ఘనత సాధించాడు. 36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పురుషుల సింగిల్స్ లో భారత్ కు ప్రపంచ పతకం అందించిన ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు. 1983లో ప్రకాశ్ పడుకోన్… 1983 ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో […]

తెలుగుతేజం సాయి ప్రణీత్ కు అరుదైన ఘనత
X
  • 1983లో ప్రకాశ్…2019లో సాయి ప్రణీత్
  • 36 ఏళ్ల తర్వాత భారత్ కు ప్రపంచ పతకం తెచ్చిన ప్రణీత్

స్విట్జర్లాండ్ లోని బాసెల్ వేదికగా ముగిసిన 2019 ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో తెలుగుతేజం సాయి ప్రణీత్ అరుదైన ఘనత సాధించాడు.

36 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పురుషుల సింగిల్స్ లో భారత్ కు ప్రపంచ పతకం అందించిన ఆటగాడిగా రికార్డుల్లో చేరాడు.

1983లో ప్రకాశ్ పడుకోన్…

1983 ప్రపంచ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ లో ప్రకాశ్ పడుకోన్ భారత్ కు కాంస్య పతకం అందించాడు. ఆ తర్వాత 36 ఏళ్ల వరకూ పురుషుల విభాగంలో భారత్ మరో పతకం సాధించలేకపోయింది.

అయితే…బాసెల్ వేదికగా ముగిసిన 2019 ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో ఆ లోటును తెలుగుతేజం, 27 ఏళ్ల సాయి ప్రణీత్ పూడ్చి భారత్ కు గర్వకారణంగా నిలిచాడు.

ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు కెంటో మోమోటో జరిగిన సెమీఫైనల్లో సాయి ప్రణీత్ 13-21, 8-21తో పరాజయం పొందినా… కాంస్యపతకం అందుకోగలిగాడు.

ప్రకాశ్ పడుకోన్ తర్వాత ఈ ఘనత సాధించిన భారత తొలి ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

జాతీయ క్రీడాపురస్కారం అర్జున అవార్డు అందుకోడానికి ముందే సాయి ప్రణీత్ ప్రపంచ బ్యాడ్మింటన్ లో కాంస్య పతకం సాధించడం విశేషం.

ప్రస్తుత 2019 ప్రపంచ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ సాధించిన రెండు పతకాలు తెలుగు తేజాలే సాధించడం మన తెలుగు రాష్ట్ర్లాలకే గర్వకారణంగా మిగిలిపోతుంది.

First Published:  28 Aug 2019 11:30 AM IST
Next Story