Telugu Global
NEWS

శివరామకృష్ణన్‌ కమిటీ కంటే... నారాయణ ఎక్స్‌పర్టా బాబు?

రాజధాని అమరావతి పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం అన్నారు‌. రాజధానికి వరద ముప్పు ఉందన్న బొత్స వ్యాఖ్యల్లో నిజం ఉందన్నారు జీవీఎల్‌. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే రాజధానిగా అమరావతిని కొనసాగించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. అయితే రాజధానికి భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏమిటి? వారికి ఎలా న్యాయం చేస్తారో? స్పష్టత నివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు జీవీఎల్‌. రాజధానికి 5వేల ఎకరాలు సరిపోతుందని…. కానీ […]

శివరామకృష్ణన్‌ కమిటీ కంటే... నారాయణ ఎక్స్‌పర్టా బాబు?
X

రాజధాని అమరావతి పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశం అన్నారు‌. రాజధానికి వరద ముప్పు ఉందన్న బొత్స వ్యాఖ్యల్లో నిజం ఉందన్నారు జీవీఎల్‌.

ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే రాజధానిగా అమరావతిని కొనసాగించే ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. అయితే రాజధానికి భూములిచ్చిన రైతుల పరిస్థితి ఏమిటి? వారికి ఎలా న్యాయం చేస్తారో? స్పష్టత నివ్వాలని ప్రభుత్వాన్ని కోరారు జీవీఎల్‌.

రాజధానికి 5వేల ఎకరాలు సరిపోతుందని…. కానీ గత ప్రభుత్వం అమరావతిలో అవసరానికి మించి భూములను సేకరించిందన్నారు.

రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందన్నది బహిరంగ రహస్యమని…. అయితే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఎలా జరిగిందన్నది ప్రభుత్వం బయటపెట్టాలన్నారు జీవీఎల్‌.

రైతుల భూములను కంపెనీలకు, వ్యక్తులకు చాలా తక్కువ ధరకు కట్టబెట్టారని…. స్విస్‌, సింగపూర్‌ ఛాలెంజ్‌ అంటూ వేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని చంద్రబాబు పై మండిపడ్డారు జీవీఎల్‌.

శివరామకృష్ణన్‌ కమిటీ నివేదిక కంటే…. నారాయణ ఎక్స్‌పర్ట్‌ అని చంద్రబాబు అభిప్రాయపడ్డారని ఎద్దేవా చేశారు. నారాయణ ఏ ఫీల్డ్‌లో ఎక్స్‌పర్ట్‌ అనేది అందరికీ తెలుసన్నారు.

అమరావతి తరలిపోతుందంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారని….. అయితే గత ప్రభుత్వంలో చంద్రబాబు రాజధానిని అభివృద్ధే చేయలేదన్నారు. కేంద్రం ఇచ్చిన 2వేల కోట్లను కూడా చదరపు అడుగుకు 10 వేల రూపాయలు ఖర్చు చేసి ప్రజాధనాన్ని లూటీ చేశారని…. కేవలం తాత్కాలిక భవనాల నిర్మాణాలకోసమే ఈ నిధులను ఖర్చు చేశారని మండిపడ్డారు. దీనికి సంబంధించిన అనేక ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయన్నారు.

ధర్మపోరాట దీక్షలు అంటూ… గత ప్రభుత్వంలో టీటీడీ నిధులను దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు జీవీఎల్‌. టీటీడీ నిధులను ఢిల్లీలో ధర్మపోరాట దీక్షకు మళ్ళించడం సిగ్గుచేటని… టీడీపీ నేతల కోసం హోటళ్ళలో విందులకు, వాహనాలకు స్వామివారి నిధులు వాడడం దారుణమన్నారు. భక్తులు ఇచ్చిన కానుకలను దీక్షలు అంటూ మింగేయడం దారుణమని మండిపడ్డారు. స్వామివారి నగలను రక్షించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో…. పోలవరం నిర్మాణంలోనూ భారీ అవినీతి జరిగిందన్నారు జీవీఎల్. 5,800 కోట్ల హెడ్‌వర్క్స్‌ పనులను కేవలం 3 కంపెనీలకే కట్టబెట్టారని గుర్తుచేశారు. ఈ కంపెనీలకు 2,346 కోట్ల రూపాయలను అధికంగా చెల్లించారని నిపుణుల కమిటీనే తేల్చిందని… కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని జీవీఎల్‌ డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని…. అవినీతి, అక్రమాలు జరిగిన ప్రతిచోటా ప్రస్తుత ప్రభుత్వం తప్పక చర్యలు తీసుకోవాలన్నారు జీవీఎల్‌.

First Published:  28 Aug 2019 11:36 AM IST
Next Story