ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు
ఢిల్లీ క్రికెట్ కు చిరునామాగా కోట్లా స్టేడియం న్యూఢిల్లీలోని చారిత్రక స్టేడియం ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరు మారనుంది. ఇక నుంచి అరుణ్ జైట్లీ స్టేడియంగా పిలవాలని ఢిల్లీ అండ్ డిస్ట్ర్రిక్ట్ క్రికెట్ సంఘం నిర్ణయించింది. కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘానికి అధ్యక్షునిగా అసమానసేవలు అందించారు. అరుణ్ జైట్లీ ప్రోత్సాహంతోనే వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కొహ్లీ లాంటి ఎందరో గొప్పగొప్ప క్రికెటర్లు వెలుగులోకి వచ్చారని, దేశానికి గర్వకారణంగా నిలిచారని ఢిల్లీ అండ్ డిస్ట్ర్రిక్ట్ క్రికెట్ […]
- ఢిల్లీ క్రికెట్ కు చిరునామాగా కోట్లా స్టేడియం
న్యూఢిల్లీలోని చారిత్రక స్టేడియం ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరు మారనుంది. ఇక నుంచి అరుణ్ జైట్లీ స్టేడియంగా పిలవాలని ఢిల్లీ అండ్ డిస్ట్ర్రిక్ట్ క్రికెట్ సంఘం నిర్ణయించింది.
కేంద్రమాజీ మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీ క్రికెట్ సంఘానికి అధ్యక్షునిగా అసమానసేవలు అందించారు. అరుణ్ జైట్లీ ప్రోత్సాహంతోనే వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కొహ్లీ లాంటి ఎందరో గొప్పగొప్ప క్రికెటర్లు వెలుగులోకి వచ్చారని, దేశానికి గర్వకారణంగా నిలిచారని ఢిల్లీ అండ్ డిస్ట్ర్రిక్ట్ క్రికెట్ సంఘం ప్రస్తుత అధ్యక్షుడు రజత్ శర్మ గుర్తు చేశారు.
ఫిరోజ్ షా కోట్లా స్టేడియానికి అరుణ్ జైట్లీ పేరు పెట్టడం సబబుగా ఉంటుందని ప్రకటించారు.
సెప్టెంబర్ 12న జరిగే కార్యక్రమంలో కోట్లాకు అరుణ్ జైట్లీ పేరును పెడతామని, విరాట్ కొహ్లీ పేరుతో సైతం ఓ స్టాండ్ ను ఏర్పాటు చేస్తామని ఢిల్లీలో రజత్ శర్మ ప్రకటించారు.
దశాబ్దాలకాలంగా ఫిరోజ్ షా కోట్లా స్టేడియంగా పలు అంతర్జాతీయ మ్యాచ్ లకు వేదికగా నిలిచిన ఢిల్లీ స్టేడియం ఇక నుంచి అరుణ్ జైట్లీ స్టేడియంగా నిలువనుంది.
మరోవైపు…అరుణ్ జైట్లీ బ్రతికి ఉన్న సమయంలోనే కోట్లా స్టేడియానికి ఆయన పేరుపెట్టి ఉంటే బాగుండేదని భారత మాజీ క్రికెటర్, బీజెపీ ఎంపీ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు.