Telugu Global
NEWS

బడికి చందా... ఇంటికో వంద

సర్కారీ కొలువు సుఖంగా ఉంటుంది. సర్కారీ చదువు మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. ప్రయివేట్ పాఠశాలల్లో చదువుకుని ప్రభుత్వం కొలువుల్లో కుదురుకున్న వారంతా ఉద్యోగాలను ఎంజాయి చేస్తున్నారే తప్ప…. ప్రభుత్వ పాఠశాలలను ఎలా బాగు చేయాలో మాత్రం పట్టించుకోవడం లేదు. అందుకే ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఏ పాఠశాల చూసినా ఏమున్నది… పాడైన భవనాలు, విరిగిపోయిన కుర్చీలు, పనికిరాని మరుగుదొడ్లే కనిపిస్తాయి. అయితే ఇందుకు భిన్నంగా ముహబూబ్ నగర్ జిల్లాలోని పాఠశాలలు […]

బడికి చందా... ఇంటికో వంద
X

సర్కారీ కొలువు సుఖంగా ఉంటుంది. సర్కారీ చదువు మాత్రం ఇబ్బందిగా ఉంటుంది. ప్రయివేట్ పాఠశాలల్లో చదువుకుని ప్రభుత్వం కొలువుల్లో కుదురుకున్న వారంతా ఉద్యోగాలను ఎంజాయి చేస్తున్నారే తప్ప…. ప్రభుత్వ పాఠశాలలను ఎలా బాగు చేయాలో మాత్రం పట్టించుకోవడం లేదు.

అందుకే ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్లుగా తెలుగు రాష్ట్రాల్లో ఏ పాఠశాల చూసినా ఏమున్నది… పాడైన భవనాలు, విరిగిపోయిన కుర్చీలు, పనికిరాని మరుగుదొడ్లే కనిపిస్తాయి. అయితే ఇందుకు భిన్నంగా ముహబూబ్ నగర్ జిల్లాలోని పాఠశాలలు మాత్రం చరిత్రను తిరగరాస్తున్నాయి. జిల్లాలోని ఏ పాఠశాలకు వెళ్లినా చక్కని వాతావరణం కనిపిస్తోంది. పాఠశాల చుట్టూ పచ్చని చెట్లు, పరిశుభ్రమైన పరిసర ప్రాంతాలు, ఇక చూడముచ్చటైన తరగతి గదులు.

ఇవన్నీ చూసిన వారికి ప్రయివేట్ పాఠశాలలు కూడా ఇంత హాయిగా, అనందంగా, పరిశుభ్రంగా ఉంటాయా అనే అనుమానం కలుగుతుంది. మహబూబ్ నగర్ జిల్లాలో ఇలాంటి వాతావరణాన్ని తీసుకురావడం వెనుక జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ పాత్ర ఎంతో ఉంది.

పాఠశాలలను బాగు చేసే బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదని, ఇందులో చదువుకుంటున్న విద్యార్ధుల తల్లితండ్రులు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిపై ఉందంటూ కలెక్టర్ ప్రచారం చేసారు.

ఇందుకోసం గత సంవత్సరం ప్రారంభించిన “ఇంటికి వంద… బడికి చందా” కార్యక్రమం చేపట్టారు. ఇప్పుడు ఆ కార్యక్రమం వటుడింతై అన్న చందంగా రోజురోజుకూ ఎదుగుతోంది.

కలెక్టర్ రొనాల్డ్ రోస్ తీసుకున్న ఈ ఇంటికి వంద… బడికి చందా కార్యక్రమానికి గ్రామస్తులు, ప్రైవేట్ కంపెనీలు, స్వచ్చంద సంస్ధలు, పూర్వ విద్యార్ధుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అందరూ తలా ఓ చేయి వేశారు. ఇప్పటి వరకూ ఈ ఇంటికి వంద… బడికి చందా కార్యక్రమానికి 1.11 కోట్ల రూపాయలు చందా రూపంలో వచ్చాయి.

ఈ నిధులతో జిల్లాలో జిల్లాలోని 601 పాటశాలలకు అన్ని సౌకర్యాలు కల్పించామని, ముందు ముందు మరిన్ని నిధులు చేరితే మిగిలిన 200 పాఠశాలలకు కూడా మౌలిక వసతుల కల్పన చేపడతామని కలెక్టర్ రొనాల్డ్ రోస్ చెబుతున్నారు.

ఇక కలెక్టర్ ప్రవేశపెట్టిన ఈ వినూత్న పథకానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని, జిల్లాలోని మిగిలిన పాఠశాలల్లో కూడా అతి త్వరలో అన్ని వసతులు కలిగిన పాఠశాలలే కనిపిస్తాయని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

ఎవరో ఒకరు… ఎప్పుడో అపుడు… నడవరా ముందుకు… అన్నట్లు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ నడిచి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

First Published:  28 Aug 2019 1:45 AM IST
Next Story