Telugu Global
Cinema & Entertainment

సుడిగాడు సీక్వెల్... నోరు విప్పిన దర్శకుడు

అల్లరి నరేష్ కి తన కెరీర్ లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్నప్పటికీ సుడిగాడు చిత్రం మాత్రం స్పెషల్ గా గుర్తుండిపోతుంది. ఈ సినిమా తో నరేష్ సడన్ స్టార్ అనే బిరుదు కూడా సొంతం చేసుకున్నారు. వరుస పరాజయాలలో ఉన్న నరేష్ కు సుడిగాడి సినిమా భారీ హిట్ తో పాటు మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. 2012లో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా… విడుదల అయిన మొదటి రోజే హిట్ టాక్ […]

సుడిగాడు సీక్వెల్... నోరు విప్పిన దర్శకుడు
X

అల్లరి నరేష్ కి తన కెరీర్ లో ఎన్ని హిట్ సినిమాలు ఉన్నప్పటికీ సుడిగాడు చిత్రం మాత్రం స్పెషల్ గా గుర్తుండిపోతుంది. ఈ సినిమా తో నరేష్ సడన్ స్టార్ అనే బిరుదు కూడా సొంతం చేసుకున్నారు. వరుస పరాజయాలలో ఉన్న నరేష్ కు సుడిగాడి సినిమా భారీ హిట్ తో పాటు మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది.

2012లో భీమనేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా… విడుదల అయిన మొదటి రోజే హిట్ టాక్ సొంతం చేసుకుంది. భారీ కలెక్షన్స్ కూడా రాబట్టింది.

ఈ సినిమా ఒక తమిళ సినిమా కి రీమేక్. అయినప్పటికీ భీమనేని శ్రీనివాస్ తెలుగు ప్రేకకులకు నచ్చే విధంగా కథలో కొన్ని మార్పులు చేశాడు. ఫ్లాపుల్లో ఉన్న నరేష్ కు భారీ విజయం అందించాడు.

అయితే మళ్ళీ నరేష్ వరుస పరాజయాల్లో ఉన్నాడు. ఇదే విషయమై ఈ సినిమా దర్శకుడు ని కూడా ఇటీవలే మీడియా ప్రశ్నించింది. కౌసల్య కృష్ణమూర్తి సినిమా ప్రమోషన్స్ తో బిజీ గా ఉన్న దర్శకుడిని…. సుడిగాడు సీక్వెల్ గురించి ఆరా తీయగా… కథ సిద్ధం అవుతుంది అని, అది రెడీ అవ్వగానే ఒక ప్రకటన చేస్తానని తెలిపాడు.

First Published:  28 Aug 2019 7:17 AM IST
Next Story