Telugu Global
NEWS

పథకాల షెడ్యూల్‌ను ప్రకటించిన జగన్‌

సెప్టెంబర్ నుంచి నెలకో పథకాన్ని ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. పథకాల అమలు కోసం క్యాలెండర్‌ను ప్రకటించారు. సెప్టెంబర్‌ చివరిలో ఆటోలు, ట్యాక్సీ డైవర్లకు 10వేల నగదు సాయం అందిస్తారు. అక్టోబర్లో రైతులకు రైతు భరోసా కింద 12,500 అందిస్తారు. నవంబర్‌లో మత్స్యకారులకు 10వేల సాయం అందిస్తారు. మత్స్యకారులకు డిజిల్‌ సబ్సిడీని లీటర్‌కు 6 రూపాయల నుంచి 9రూపాయలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. డిసెంబర్‌లో చేనేత కుటుంబాలకు 24వేల ఆర్థిక సాయం చేయనున్నారు. […]

పథకాల షెడ్యూల్‌ను ప్రకటించిన జగన్‌
X

సెప్టెంబర్ నుంచి నెలకో పథకాన్ని ప్రజలకు అందించాలని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. పథకాల అమలు కోసం క్యాలెండర్‌ను ప్రకటించారు.

సెప్టెంబర్‌ చివరిలో ఆటోలు, ట్యాక్సీ డైవర్లకు 10వేల నగదు సాయం అందిస్తారు.

అక్టోబర్లో రైతులకు రైతు భరోసా కింద 12,500 అందిస్తారు.

నవంబర్‌లో మత్స్యకారులకు 10వేల సాయం అందిస్తారు. మత్స్యకారులకు డిజిల్‌ సబ్సిడీని లీటర్‌కు 6 రూపాయల నుంచి 9రూపాయలకు పెంచుతున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.

డిసెంబర్‌లో చేనేత కుటుంబాలకు 24వేల ఆర్థిక సాయం చేయనున్నారు.

జనవరి 26న అమ్మ ఒడి పథకం అమలు చేస్తారు.

ఫిబ్రవరిలో రజకులు, నాయి బ్రాహ్మణులు, టైలర్లకు 10వేల ఆర్ధిక సాయం అందిస్తారు.

అగ్రిగోల్డ్‌ బాధితులకు సెప్టెంబర్‌ నుంచి చెల్లింపులు ఉంటాయని సీఎం చెప్పారు.

స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జగన్… ప్రభుత్వం మంచి చేస్తున్నా కొందరు చూసి తట్టుకోలేకపోతున్నారని… వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లకు, ఎస్పీలకు సూచించారు.

సెప్లెంబర్‌ 5 నుంచి ఇసుక అందుబాటులోకి వస్తుందని… తక్కువ ధరకే ఇసుక అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. వరద వచ్చిన కారణంగా రాష్ట్రంలో కొత్త రీచ్‌లు ఏర్పాటు చేసేందుకు అవకాశం కూడా ఏర్పడిందని సీఎం దృష్టికి అధికారులు తీసుకొచ్చారు. ఉగాది నాటికి ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

ప్రతి వారం జిల్లా కలెక్టర్‌, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ‘కాఫీ టు గెదర్‌’ కార్యక్రమం నిర్వహించాలని సీఎం సూచించారు. ఇలా చేయడం ద్వారా అధికారుల మధ్య సమన్వయం పెరుగుతుందని… భూవివాదాల పరిష్కారనికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి సూచించారు.

భూవివాదాలు, ఇతర సమస్యలకు సంబంధించిన వివరాలను అధికారులు ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

భూవివాదాల వల్లే చాలా చోట్ల శాంతిభద్రతల సమస్య వస్తోందని… కాబట్టి ఈ విషయంలో అధికారులు, పోలీసులు అప్రమత్తంగా, కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు.

అవినీతికి మాత్రం ఎక్కడా చోటు ఇవ్వొద్దని.. తాను ఈ విషయాన్ని పదేపదే చెబుతున్నానని సీఎం స్పష్టం చేశారు.

First Published:  27 Aug 2019 10:50 AM IST
Next Story